ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పింది. బీజేపీ ఓటమికి భయపడి కేజ్రీవాల్ పై దాడి చేస్తుందని ఆప్ ఆరోపించింది.
అరవింద్ కేజ్రీవాల్ పై దాడి చేయడానికి బీజేపీ గూండాలను రప్పించిందని చెప్పింది. బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ గూండాలు అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నప్పుడు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని ఆరోపించింది. కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకు ఇలా చేశారని చెప్పింది. కేజ్రీవాల్ దాడులకు భయపడరని, ఢిల్లీ ప్రజలు బీజేపీ తగిన సమాధానం ఇస్తారని ఆప్ అంటోంది.
ఒక బ్లాక్ ఎస్‌యూవీ చుట్టూ కొంతమంది నిరసనకారులు చేరి, కారును అడ్డుకోవడంతో ఇరువైపులా భద్రతా సిబ్బంది అడ్డుగా నిలిచారు. ఒక వైపు నుంచి ఒక పెద్ద రాయి వచ్చి కేజ్రీవాల్ కూర్చున్న కారు పైకప్పును తాకి, పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆప్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
हार के डर से बौखलाई BJP, अपने गुंडों से करवाया अरविंद केजरीवाल जी पर हमला‼️
BJP प्रत्याशी प्रवेश वर्मा के गुंडों ने चुनाव प्रचार करते वक्त अरविंद केजरीवाल जी पर ईंट-पत्थर से हमला कर उन्हें चोट पहुंचाने की कोशिश की ताकि वो प्रचार ना कर सकें।
बीजेपी वालों, तुम्हारे इस कायराना… pic.twitter.com/QcanvqX8fB
— AAP (@AamAadmiParty) January 18, 2025
Kolikapudi Srinivasarao: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్