Asaduddin Owaisi: పీఎఫ్ఐ‌పై ఐదేళ్ల నిషేధాన్ని తప్పుపట్టిన ఓవైసీ.. తమ అభిప్రాయాన్ని చెప్పాలనుకునే ముస్లింలపై నిషేధమని వ్యాఖ్య..

పీఎఫ్‌ఐ విధానాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తానని అయితే పీఎఫ్‌ఐపై నిషేధానికి తాను మద్దతివ్వలేనని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. నేరం చేసే కొంతమంది వ్యక్తుల చర్యలు సంస్థను నిషేధించాల్సిన అవసరం లేదని అన్నారు.

Asaduddin Owaisi: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI), దాని అనుబంధ సంస్థలను కేంద్రం ఐదేళ్లు నిషేధించిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయాన్ని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. అయితే.. తన స్టాండ్ పీఎఫ్ఐకి కూడా అనుకూలం కాదని స్పష్టం చేశారు. యూఏపీఏ పట్ల తన వ్యతిరేకత నుండి, ఈ రకమైన కఠినమైన నిషేధం ప్రమాదకరమని, అది తన అభిప్రాయాన్ని చెప్పాలనుకునే ముస్లింలపై నిషేధం అని అన్నారు. ప్రతి ముస్లిం యువకుడు ఇప్పుడు భారతదేశంలోని నల్లచట్టం యూఏపీఏ కింద పీఎఫ్ఐ కరపత్రంతో అరెస్టు చేయబడతారంటూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ముస్లింలు కోర్టులు నిర్దోషులుగా ప్రకటించబడక ముందు దశాబ్దాలుగా జైలు జీవితం గడిపారని, నేను యూఏపీఏను వ్యతిరేకించాను, దాని కింద అన్ని చర్యలను ఎప్పుడూ వ్యతిరేకిస్తాను, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగమైన స్వేచ్ఛ యొక్క సూత్రానికి విరుద్ధంగా నడుస్తుందని ఒవైసీ ట్వీట్ చేశారు.

Centre bans PFI and related outfits for 5 years: పీఎఫ్ఐపై ఐదేళ్లు బ్యాన్ విధించిన కేంద్రం

2020లో హత్రాస్‌కు వెళ్లే సమయంలో అరెస్టయిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ కేసును ప్రస్తావిస్తూ.. ఈ కేసు కప్పన్ టైమ్‌లైన్‌ను కూడా అనుసరిస్తుందని, ఇక్కడ ఎవరైనా కార్యకర్త, జర్నలిస్ట్ యాదృచ్ఛికంగా అరెస్టు చేయబడి బెయిల్ పొందడానికి రెండు సంవత్సరాలు పడుతుందని ఒవైసీ అన్నారు. ఒక దళిత మహిళపై సామూహిక అత్యాచారం, హత్య గురించి నివేదించడానికి కప్పన్ హత్రాస్‌కు వెళ్తున్నాడు. ఆయనపై యూఏపీఏ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. కప్పన్‌కు 2022లో బెయిల్ వచ్చింది. అయితే రెండేళ్ల జైలు జీవితం తర్వాత.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పీఎఫ్‌ఐ విధానాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తానని అయితే పీఎఫ్‌ఐపై నిషేధానికి తాను మద్దతివ్వలేనని ఒవైసీ అన్నారు. నేరం చేసే కొంతమంది వ్యక్తుల చర్యలు సంస్థను నిషేధించాల్సిన అవసరం లేదని ఓవైసీ అన్నారు. పీఎఫ్‌ఐతో పాటు మరో ఎనిమిది అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు కేంద్రం నిషేధించిన విషయం విధితమే. పీఎఫ్ఐకి స్పష్టమైన ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని, అది సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్థగా పనిచేస్తున్నప్పటికీ, సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని సమూలంగా మార్చేందుకు ఆ సంస్థలు రహస్యంగా పనిచేశాయని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు