Asaduddin ఒవైసీ నివాసాన్ని ధ్వంసం చేసిన దుండగులు

ఒవైసీ నివాసంపై దాడి జరిగింది. దుండగుల దాడిలో ఒవైసీ నివాసంలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసం అయ్యాయి. వారి చేతిలో గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయి.

Asaduddin Owaisi

Asaduddin Owaisi : ఢిల్లీలో ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు హిందూ సేనకు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇటీవల అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే తాము ఈ దాడులు చేసినట్టు వారు తెలిపారు. ఈ మేరకు డీసీపీ దీపక్ యాదవ్ వెల్లడించారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.

Covaxin Kids : త్వరలోనే చిన్నారులకు కొవాగ్జిన్.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్

దుండగుల దాడిలో ఒవైసీ నివాసంలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసం అయ్యాయి. ఎంపీగా ఆయనకు ఢిల్లీలోని అశోక్ రోడ్డులో నివాసం కేటాయించారు. ఈ నివాసంపైనే దాడి జరిగింది. దీనిపై ఒవైసీ ఘాటుగా స్పందించారు. పిరికిపందలు గుంపుగా వచ్చి దాడి చేశారని, అదీ తాను ఇంట్లో లేని సమయం చూసి వచ్చారని అన్నారు. వారి చేతిలో గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయని, వారు తన నివాసంపై రాళ్ల దాడి చేశారని, తన ఇంటి నేమ్ ప్లేట్ ను కూడా ధ్వంసం చేశారని వివరించారు.

గత 40 ఏళ్లుగా ఈ ఇంటిని కనిపెట్టుకుని ఉంటున్న రాజు అనే వ్యక్తిపైనా దాడికి పాల్పడ్డారని, దాడి సందర్భంగా వారు మతపరమైన నినాదాలు చేశారని ఒవైసీ చెప్పారు. రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని వెల్లడించారు. తన నివాసంపై దాడికి పాల్పడడం ఇది మూడోసారని తెలిపారు. ఓ ఎంపీ నివాసానికే రక్షణ లేకపోతే కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా ఏం భరోసా ఇవ్వగలరు? అని ప్రశ్నించారు. అతివాదాన్ని నిర్మూలించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి ప్రచవనాలు వినిపిస్తుంటారని, తన ఇంటిపై దాడి చేసిన గూండాలకు అతివాదం నేర్పింది ఎవరో చెప్పాలని ఒవైసీ నిలదీశారు.

Credit, Debit కార్డుదారులకు అలర్ట్… అక్టోబ‌ర్ 1 నుంచి కొత్త రూల్స్

ఈ దాడులతో తమను భయపెట్టాలని ఈ గూండాలు అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదని, బహుశా వారికి మజ్లిస్ ఏ ప్రాతిపదికన ఏర్పడిందో తెలిసుండకపోవచ్చని అన్నారు. న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.