Lakhimpur Kheri : నేపాల్ సరిహద్దుల్లో అజయ్ మిశ్రా, అరెస్టు చేస్తారా ?

శుక్రవారం ఉదయం పది గంటలకు క్రైమ్‌ బ్రాంచ్‌ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. విచారణకు ఆశిష్ మిశ్రా హాజరు కాలేదు. ఆశిష్ ను పట్టుకుంటారా ? అనే ఉత్కంఠ నెలకొంది.

Lakhipur

Ashish Mishra : లఖింపూర్‌ ఖేరి దుర్ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు సమన్లు పంపించింది. విచారణ నిమిత్తం 2021, అక్టోబర్ 08వ తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు క్రైమ్‌ బ్రాంచ్‌ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. విచారణకు స్వయంగా హాజరై లిఖితపూర్వకంగా, మౌఖికంగా, ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌తో పాటు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడనే విషయం తెలియడం లేదంటున్నారు. ఒకట్రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. శుక్రవారం విచారణకు ఆశిష్ మిశ్రా హాజరు కాలేదు. ఆశిష్ మిశ్రా ఎక్కడున్నాడో విషయం పోలీసులు తెలుసుకున్నట్లు సమాచారం. భారత్ – నేపాల్ సరిహద్దులకు వెళ్లినట్లు, నేపాల్ సరిహద్దులోని గౌరీ ఫాంటాలో ఆశిష్ ఉన్నట్లు గుర్తించారు. లోకేషన్ గుర్తించిన నేపథ్యంలో ఆశిష్ ను పట్టుకుంటారా ? అనే ఉత్కంఠ నెలకొంది. సంయుక్త కిసాన్ సమావేశం శుక్రవారం రోజున జరుగనుంది. భవిష్యత్ లో ఎలా వ్యవహరించాలనే దానిపై సమావేశంలో చర్చించనున్నారు.

Read More : Lakhimpur Kheri : ఆశిష్ మిశ్రాకు సమన్లు, విచారణకు వస్తారా ? అసలు ఎక్కడున్నారు ?

అక్టోబర్​ 3న లఖింపూర్​ ఖేరి జిల్లాలో రైతులు నిరసన చేస్తుండగా.. కేంద్ర మంత్రి కాన్వాయ్​ వారిపైకి దూసుకెళ్లిప ఘటనలో నలుగురు చనిపోగా… అనంతరం జరిగిన ఘర్షణలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. లఖింపూర్‌ దుర్ఘటనపై ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు, విమర్శలు చేస్తున్నాయి. ప్రధాన నిందితుడైన మంత్రి కుమారుడు ఆశిష్‌ను అరెస్టు చేయాలంటూ పదేపదే డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ చేయడంతో పాటు.. మరోవైపు జ్యుడీషియరీ ఎంక్వయిరీకి ఆదేశించింది ప్రభుత్వం. విచారణకు రాలేకపోవడంతో పోలీసులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.