గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు.. హాజరైన లోకేశ్, పలువురు మంత్రులు, ఎంపీలు.. వీడియో..

గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

Ashok Gajapathi Raju

Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్ బంగ్లా దర్భార్ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రివర్గ సభ్యులు , కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఏపీ నుంచి మంత్రి నారా లోకేశ్ తో పాటు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, పలువురు టీడీపీ ఎంపీలు హాజరయ్యారు.