ముంబైలోని అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి నటి ఆత్మహత్య చేసుకుంది. ఓ కమర్షియల్ యాడ్ ద్వారా పెరల్ పంజాబీ గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని ఏళ్ల పాటు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోయింది. చివరిసారిగా విడుదలైన సినిమా అనుకున్న మేర హిట్ కాలేదు. సుదీర్ఘ కాలంగా సినిమాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది.
గురువారం రాత్రి జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఒశివారా బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ బిపిన్ కుమార్ అర్ధ రాత్రి 12: 15నుంచి 12: 30సమయంలో అరుపులు వినిపిస్తున్నాయి. నటి ఉంటున్న మూడో ఫ్లోర్ నుంచి వినిపిస్తున్న కేకలు రోడ్ మీద ఎవరో అరుస్తున్నట్టుగా అనిపించింది. ఏం జరిగిందో చూద్దామని వెళ్లే సరికి అక్కడేం కనిపించలేదు’
కాసేపటి తర్వాత థర్డ్ ఫ్లోర్ నుంచి పడి నటి ఆత్మహత్య చేసుకుంది. గతంలోనూ రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. తల్లీ కూతుళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని, అదే కాకుండా కాస్త మతిస్తిమితం కూడా లేకుండా ప్రవర్తించేదని స్థానికులు పేర్కొన్నారు.