Assam Assembly Elections Results 2026 : అసోంలో మళ్లీ బీజేపీనే.. మేజిక్ ఫిగర్ దాటేసింది.. వరుసగా మూడోసారి అధికారంలోకి..
Assam Assembly Elections Results 2026 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అస్సాంలో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఆ పార్టీ మూడోసారి అధికారం చేపట్టే అవకాశం ఉంది.
- Harish Thanniru
- Updated on- May 4, 2026 / 09:35 AM IST
Assam Assembly Elections Results 2026
Assam Assembly Elections Results 2026 : దేశంలోని తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతోపాటు అస్సాం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. అయితే, అస్సాంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ మరోసారి అధికారం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే అస్సాంలో రెండుసార్లు అధికారాన్ని చేపట్టిన బీజేపీ.. మూడోసారి అధికారంలోకి రావడం ఖాయంగా మారింది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో బీజేపీ మేజిక్ ఫిగర్ దాటేసింది. అస్సాం రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత నెల 9వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరిగింది. 85.96శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో బీజేపీ మ్యాజిగ్ ఫిగర్ 64 దాటేసింది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల పలితాలు వస్తున్నాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అస్సాంలో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని చెప్పాయి. బీజేపీ 85 నుంచి 95 స్థానాల్లో గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 32 స్థానాలకు పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి.
అస్సాం రాష్ట్రంలో గత (2021) ఎన్నికల ఫలితాలు ఇలా.. (మొత్తం సీట్లు 126, మ్యాజిక్ ఫిగర్ : 64)
బీజేపీ – 60
ఏజీపీ – 9
యూపీపీఎల్ – 6
కాంగ్రెస్ – 29
ఏఐయూడీఎఫ్ – 16
బీపీఎఫ్ – 4
సీపీఎం -1
స్వతంత్రులు – 1
