Assam : కరెంట్ బిల్లులు కట్టలేకపోతే ఫ్యాన్లు బంద్‌ చేసి చెట్ల కింద కూర్చోండీ : స్పీకర్‌ వ్యాఖ్యలు

ప్రజలు విద్యుత్ చార్జీలు కట్టలేకపోతే ఫ్యాన్లు వాడటం మానుకోవాలని..దానికి బదులు చెట్లనీడలో కూర్చోవాలని సలహా ఇచ్చారు. ఫ్యాన్లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు అసలే వినియోగించవద్దని..ఫ్యాన్లకు బదులుగా చెట్లనీడన సేదతీరండి అంటూ వ్యాఖ్యానించారు.

Assam Speaker Biswajit Daimary : బీజేపీ అధికారంలో ఉన్న అస్సాం రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం ప్రైవేటు కంపెనీల నుంచి విద్యదుత్ కొనుగోలు చేయటంతో విద్యుత్ చార్జీలు పెంచింది.దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో స్పీకర్ విశ్వజిత్‌ దైమరీ ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

 

ప్రజలు విద్యుత్ చార్జీలు భరించలేని స్థితిలో ఉంటే వారు ఫ్యాన్లు వాడటం మానుకోవాలని..దానికి బదులు చెట్లనీడలో కూర్చోవాలని సలహా ఇచ్చారు. ఫ్యాన్లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు అసలే వినియోగించవద్దని..ఫ్యాన్లకు బదులుగా చెట్లనీడన సేదతీరండి అంటూ వ్యాఖ్యానించారు. దీని వల్ల విద్యుత్ బిల్లులు తక్కువగా వస్తాయని ఉచిత సలహా ఇచ్చారు.

 

స్పీకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు సంధించింది. బీజేపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను తీర్చలేక ఇటువంటి అర్థం పర్థం లేని సలహాలు ఇస్తోంది అంటూ సెటైర్లు వేసింది. విద్యుత్ సమస్యలు పరిష్కరించటానికి యత్నించకుండా ఇటువంటి సలహాలు ఏంటీ?ఇదేనా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పాలన అంటే…?అంటూ ప్రశ్నించింది. విద్యుత్ వాడకం తగ్గించుకోవటానికి ప్రజల్ని ఫ్యాన్లు వాడొద్దని స్పీకర్ విశ్వజిత్ దైమరీ ఉచిత సలహాలు ఇవ్వటం చూస్తే అస్సాంలో విద్యుత్ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు