Durga Puja Pandals : దుర్గాపూజ మండపాలకు ప్రభుత్వ గ్రాంట్…అసోం సర్కారు నిర్ణయం

దుర్గాపూజ మండపాల నిర్వాహకులకు అసోం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని దుర్గాపూజ పాండల్స్ కోసం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది....

Durga Puja Pandal

Durga Puja Pandals : దుర్గాపూజ మండపాల నిర్వాహకులకు అసోం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని దుర్గాపూజ పాండల్స్ కోసం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అధ్యక్షతన గౌహతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దుర్గాపూజ పండుగకు ముందు అసోం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 6,953 పూజా మండపాలకు 10 వేల రూపాయల చొప్పున గ్రాంట్-ఇన్-ఎయిడ్‌గా అందించాలని నిర్ణయించింది.

Also Read : Airstrike : గాజా ఆసుపత్రిపై వైమానిక దాడిలో 500 మంది మృతి

కేబినెట్ నిర్ణయాలను అసోం టూరిజం మంత్రి జయంత మాల్ బారుహ్ చెప్పారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 10, 2024 వరకు కేబినెట్ మంత్రులందరూ ఒక నిర్దిష్ట గ్రామంలో అయిదు పగలు, 5 రాత్రులు బస చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సందర్భంగా 400 హయ్యర్ సెకండరీ పాఠశాలల భవనాలకు శంకుస్థాపన చేస్తారు. తేయాకు తోట ప్రాంతాల్లో కొత్త పాఠశాలలకు శంకుస్థాపనలు చేస్తారు. మిషన్ బాసుంధర 2.0 కింద పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణాలకు 123 స్థానిక, భూమిలేని కుటుంబాలకు స్థలాలు ఇవ్వనున్నారు.

ట్రెండింగ్ వార్తలు