Salary Cut : ఉద్యోగులకు బిగ్ షాక్.. రెండో పెళ్లి చేసుకుంటే జీతం కట్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

Employee Salary Cut : మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండా రెండో పెండ్లి చేసుకుంటే ఆ ఉద్యోగి జీతం నుంచి నెలకు 20శాతం కోత విధిస్తామని అస్సొం ప్రభుత్వం పేర్కొంది.

Assam Government Pay Cut in Employee Salary for 2nd Marriage without Divorce

Assam Government Salary Cut : అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20శాతం కట్ చేస్తామని హెచ్చరించింది. ఆ మొత్తాన్ని మొదటి భార్య బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తామని తెలిపింది. ఈ మేరకు అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ ప్రకటన చేశారు.

Also Read : Telangana : తెలంగాణలో సర్ ముసాయిదా విడుదల.. డేంజర్‌లో 92లక్షల మంది ఓట్లు.. మీ పేరు ఉందో ఇలా చెక్ చేసుకోండి..

అస్సాంలో  ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ కీలక హెచ్చరిక చేశారు. మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండానే మరో వివాహం చేసుకున్నట్లు తేలితే, ఉద్యోగి జీతంలో 20శాతం కోత విధించి ఆ మొత్తాన్ని మొదటి భార్య ఖాతాలోకి జమ చేస్తామని సీఎం తెలిపారు. అయితే ఇందుకోసం మొదటి భార్య ప్రభుత్వం వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. సంబంధిత విషయం కోర్టులో విచారణలో ఉన్న సమయంలో కూడా మొదటి భార్యకు ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు.

అస్సాం సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్‌లో ఇప్పటికే జీవిత భాగస్వామి ఉన్నప్పుడు మరో వివాహం చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అనే నిబంధన ఉంది. రెండో వివాహానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం కాకుండా.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న మహిళలకుకూడా రక్షణ కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని హిమంత బిస్వ శర్మ తెలిపారు. ఇందుకోసం చట్టపరమైన చర్యలు తీసుకునే అంశంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

తమ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.. విడాకులు తీసుకోకుండానే భార్యను వదిలిపెట్టి మరో వివాహం చేసుకునే సందర్భాల్లో, న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు మొదటి భార్య ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడడమేనని సీఎం హిమంతు బిస్వశర్మ స్పష్టం చేశారు.