అసెంబ్లీలో కార్పెట్ పై పడుకుని…MLAల వినూత్న నిరసన

వివిధ సమస్యలను లేవనెత్తుతూ అసోం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వినూత్నంగా తమ నిరసన తెలియజేశారు. అసోంలో తీసుకొచ్చిన కొత్త ల్యాండ్ పాలసీ, ఎన్‌ఆర్‌సీ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌) సహా ఇతర ఇష్యూలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే షెర్మన్‌ అలీ అహ్మద్‌తోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో కింద పరిచిన రెడ్‌ కార్పెట్‌పై పడుకున్నారు. రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.