ప్రజల వాయిస్ ను బీజేపీ వినడం లేదన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. పౌరసత్వ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలంటూ వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు మూడో వారంకు చేరుకున్నాయి. రాజ్యంగ రక్షణ-భారత్ రక్షణ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని లీడ్ చేసేందుకు అసోం వెళ్లిన రాహుల్ ఇవాళ గౌహతిలో జరిగిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ…బీజేపీ ఎక్కడికి వెళ్తే.. అక్కడ ఆ పార్టీ ద్వేషాన్ని వ్యాపి చేస్తుందన్నారు. ఆందోళనకారుల్ని కాల్చి చంపుతున్నారని రాహుల్ ప్రశ్నించారు.
ప్రజల గొంతును బీజేపీ వినడం లేదన్నారు రాహుల్. ఈశాన్యరాష్ట్రాల సంస్కృతి,చరిత్రను అణిచివేయాలని బీజేపీ నాయకులు అనుకుంటున్నారన్నారు. ఈశాన్య ప్రజల నాడిని బీజేపీ అర్థం చేసెకోలేదన్నారు. అస్సామీ భాష, సంస్కృతిపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దాడిని అనుమతించబోమని రాహుల్ అన్నారు. అస్సాంను నాగపూర్ నడిపించదన్నారు. అస్సాంను అస్సామీలే పాలిస్తారని రాహుల్ తెలిపారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాహుల్ ఈ సందర్భంగా పరామర్శించనున్నారని అసోం కాంగ్రెస్ ఇంచార్జ్ తెలిపారు.