సైన్యాన్ని అవమానిస్తూ రచయిత్రి ఫేస్‌బుక్ పోస్ట్.. అరెస్ట్ చేసిన పోలీసులు

దేశ రక్షణలో భాగమైన సైన్యాన్ని అవమానిస్తూ పోస్ట్ చేసిన ఓ రచయిత్రిని అరెస్ట్ చేశారు పోలీసులు. సైనికుల పోరాటాలను, వారి ధైర్య సాహసాలను అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శిఖా శర్మ అనే మహిళపై ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశారు.

ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్యలో జరిగిన కాల్పుల్లో 22మంది జవాన్లు చనిపోగా.. ఈ ఘటనపై అసోంకు చెందిన రచయిత్రి శిఖా శర్మ.. జీతాలు తీసుకుని పని చేసే ఉద్యోగులు కాల్పుల్లో చనిపోతే అమరులా? అంటూ ప్రశ్నిస్తూ.. పోస్ట్ చేసింది. ఇది రాష్ట్రంలో కాంట్రవర్శియల్ కావడంతో.. పలువురు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

గౌహతికి చెందిన ఉమి దేకా బరువా, కంకణ గోస్వామి‌లు ఫేసుబుక్‌‌లో పోస్టు చూసి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారి ఫిర్యాదు మేరకు గౌహతి పోలీసులు శిఖాశర్మపై ఐపీసీ సెక‌్షన్‌ 294 (ఏ, 124 (ఏ), 500, 506, ఐటీ చట్టం 45 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ‘నెలనెలా ప్రభుత్వం నుంచి జీతం తీసుకునేవాళ్లు.. చనిపోతే అమరవీరులుగా గుర్తించొద్దు. విద్యుత్‌ ఉద్యోగులు కూడా ప్రమాదాల్లో చనిపోతూ ఉంటారు. వారిని కూడా అమరవీరులుగా ప్రకటించొచ్చు కదా? ప్రజలను భావోద్వేగాలకు గురి చేయొద్దు’ అంటూ స్థానిక భాషలో ఆమె పోస్టింగ్‌లు చేశారు.

Assam Writer

ట్రెండింగ్ వార్తలు