జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది. జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు. జరగనున్నాయి. మొత్తం 90 స్థానాలకు సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. వీటి లెక్కింపు అక్టోబర్ 4న ఉంటుంది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూల్
నోటిఫికేషన్: ఆగస్టు 20, 29, సెప్టెంబర్ 5
నోటిఫికేషన్ చివరి తేదీ: ఆగస్టు 27, సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 12
నామినేషన్ పరిశీలన: ఆగస్టు 28, సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 13
ఉపసంహరణకు చివరి తేదీ: ఆగస్టు 30, సెప్టెంబర్ 9, సెప్టెంబర్ 17
పోల్ తేదీ: 18 సెప్టెంబర్, 25 సెప్టెంబర్, 1 అక్టోబర్