ముదిరిన వివాదం : వెస్ట్ బెంగాల్ గవర్నర్‌కు అవమానం

  • Publish Date - December 5, 2019 / 06:40 AM IST

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం..గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇరువురి మధ్య వివాదం ముదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం ఉదయం ఆయన అసెంబ్లీకి వచ్చారు. కానీ గేటు మూసి వేసి తాళం వేసి ఉంది. దీనిపై ఆయన ఫైర్ అయ్యారు. మూడో గేటు క్లోజ్ చేసి ఉండడంతో తాను అసెంబ్లీ లోనికి వెళ్లలేకపోయానని, చారిత్రాత్మక భవనం చూసేందుకు వచ్చానని మీడియాకు తెలిపారు.

సమావేశాలు లేనంత మాత్రాన..అసెంబ్లీ గేట్లు మూసివేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగ హక్కుల ప్రకారం తాను నడుచుకుంటానని, రబ్బర్ స్టాంపు..పోస్టాపీసో కాదని వెల్లడించారు. బిల్లులు క్లియర్ కాకపోవడంతో అసెంబ్లీని రెండు రోజుల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే కోల్‌కతా వర్సిటీని గవర్నర్ సందరించారు. అక్కడ వర్సిటీ ఛాన్సలర్ లేకపోవడంతో గవర్నర్ సీరియస్ అయ్యారు. 

సీఎం మమత బెనర్జీ, గవర్నర్ జగదీప్ మధ్య వివాదం ముదిరినట్లైంది. కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారని, బీజేపీలో డైరెక్షన్ పనిచేస్తున్నారని సీఎం మమత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరిగిన పరిణామంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 
Read More : మరో అమానుషం : అత్యాచార బాధితురాలిని సజీవదహనం చేసే ప్రయత్నం