50 Tourists
Mussoorie Kempty: మహమ్మారి విలయ తాండవం జరుగుతూనే ఉంది. ఏదో కాస్త కేసులు తగ్గితే చాలు.. మాస్కులు మరిచి దూరాన్ని విడిచి అంతా పోగై పోతున్నారు. ఇలాంటి వాళ్ల వల్ల కాదా వైరస్ విజృంభించేది. హద్దూ.. అదుపు లేకపోతే ఎలా అంటూ సోషల్ మీడియాలో లేచిన దుమారానికి ఉత్తరాఖాండ్ ప్రభుత్వం కఠిన చర్యలే తీసుకునేందుకు ముందుకొచ్చింది.
ఉత్తరాఖండ్ ముస్సోరీలోని కెంప్టీ జలపాతం వద్ద పెరుగుతున్న పర్యాటకుల తాకిడికి అడ్డుకట్ట వేసింది. పర్యాటకులు కరోనా నిబంధనలు మరిచి ప్రవర్తిస్తుండటంతో కేవలం 50మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. ఒక్కో పర్యాటకుడు అరగంట కంటే ఎక్కువ సేపు ఉండటానికి వీల్లేదని అధికారిక స్టేట్మెంట్ విడుదలైంది.
‘కేవలం 50మంది టూరిస్టులకు మాత్రమే ముస్సోరీలోకి అనుమతించాం. వారంతా అరగంటకు మించి ఉండటానికి వీల్లేదు’ అని జిల్లా మెజిస్ట్రేట్ తేరీ గర్వాల్ అంటున్నారు. టూరిస్టులను మానిటర్ చేయడం కోసం చెక్ పోస్టును కూడా ఏర్పాటు చేశారు.
ముస్సోరీలోని కుల్దీ బజార్, మాల్ రోడ్ ఏరియాలు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. నైనిటాల్ లో కూడా టూరిస్టులు పెరిగిపోవడం అదే అదే పరిస్థితి. ఇలా ముస్సోరీలో గుమిగూడి తిరుగుతుండటంపై, వాటర్ ఫాల్స్ వద్ద పెరుగుతున్న జన సంచారం గురించి కీలక నిర్ణయం తీసుకుంది.
థర్డ్ వేవ్ కు వీరు ఆద్యం పోస్తున్నారని కొందరు అంటే మీ తలల్లో బుర్ర లేదంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. మరో నెటిజన్ “కెంప్టీలో ఖాళీ మెదళ్ళు” అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.