కరోనా సోకిన యువతిపై డాక్టర్ అత్యాచార ప్రయత్నం

  • Publish Date - July 23, 2020 / 06:59 AM IST

కరోనా సోకిన వారిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. కానీ కొంతమంది డాక్టర్లకు కామంతో కళ్లు మూసుకపోతున్నాయి. కరోనా రోగులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవలే కొంతమంది డాక్టర్లు..లైంగిక దాడులకు పాల్పడుతూ..వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు.

తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో DDU Hospital లో 28 ఏళ్ల కరోనా సోకిన యువతిపై వైద్యుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆలీ ఘర్ ప్రాంతంలో ఓ యువతికి కరోనా టెస్టులు చేయగా..పాజిటివ్ గా నిర్ధారించారు.

అనంతరం ఆమెను DDU Hospital కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విధుల్లో లేని ఓ డాక్టర్ ఆమె చికిత్స పొందుతున్న వార్డులోకి వచ్చి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. రెండుసార్లు లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు 376(2) సెక్షన్ కింద కేసు బుక్ చేశారు. పోలీసులు విచారణ చేపట్టారని డా.ఏబీ సింగ్ (CMS, DDU hospital) వెల్లడించారు. అత్యాచార ప్రయత్నం జరిగిందని పోలీసులు FIR దాఖలు చేశారని ఆలీఘర్ జిల్లా మెజిస్ట్రేట్ వెల్లడించారు. వేధింపులు, అత్యాచార ప్రయత్నాలు జరిగాయని, పోలీసులు జరిపిన విచారణలో నిజమేనని తేలిందని ఆలీ ఘర్ డీఎం చంద్రభూషణ్ సింగ్ తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, వైద్యుడిని అరెస్టు చేయడం జరిగిందన్నారు.