కరోనా భయం…కశ్మీర్ లో 42వేల చెట్ల నరికివేత

కరోనా వైరస్ భయంతో జమ్మూకశ్మీర్ లో వేలసంఖ్యలో చెట్లను నరికేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో 42వేల ఆడ “పోప్లార్”చెట్లను నరికేయాలని గత వారం స్థానిక యంత్రాంగం సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ను ఆదేశించింది. రైతులు,ప్రేవేట్ ల్యాండ్ ఓనర్లు కూడా ఆడ పోప్లార్ చెట్లను నరికేసేలా చూడాలని జిల్లా అధికారులను కూడా ఆదేశించింది.

స్థానికంగా రుస్సీ ఫ్రాస్ గా పిలువబడే పోప్లార్ చెట్లు…పత్తి రూపంలో ఉండే పుప్పొడి లేదా బీజరేణువులను విడుదల చేస్తుంది. దీని వల్ల కొంతమందిల్లో శ్వాసకోస ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆడ పోప్లార్ చెట్ల నుంచి విడుదలయ్యే బీజరేణువుల వల్ల కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుందన్న భయంతో ఈ చెట్లను నరికేస్తున్నారు. అయితే ఈ కరోనా వైరస్ ప్రసారానికి లేదా శ్వాసకోస వ్యాధులకు ఈ చెట్ల నుంచి విడుదలయ్యే బీజరేణువులు కారణమని నిర్థారించే ఏ ఒక్క సైంటిఫిక్ స్టడీ(శాస్త్రీయ అధ్యయనం) లేదని నిపుణులు చెబుతున్నారు.

అధికారిక రికార్డుల ప్రకారం…2కోట్ల పోప్లార్ చెట్లకు కశ్మీర్ ప్రాంతం నివాసంగా ఉంది. వీటిని నార్త్ అమెరికన్ కాటన్ ట్రీ(NACT)గా కూడా పిలుస్తుంటారు. కలప అవసరాన్ని తీర్చడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడానికి మరియు అటవీ నిర్మూలనకు సహాయపడటానికి వరల్డ్ బ్యాంక్ సహాయక సామాజిక అటవీ ప్రాజెక్టు ద్వారా 1982 లో ఇవి ఈ ప్రాంతంలో ప్రవేశపెట్టబడ్డాయి. అప్పటి నుండి ఈ చెట్టు కాశ్మీర్ యొక్క ప్రకృతి దృశ్యం మరియు ఆకుపచ్చ కవర్ లో ప్రధాన భాగంగా మారింది.

భారీ స్థాయిలో ఈ చెట్లను తాము నరికేయలేమని,ఇది పర్యావరణ విపత్తు అని శ్రీనగర్ ప్రాంతంలోని మొహమ్మద్ మౌహీమ్ అనే ఓ బోటనిస్ట్(వృక్షశాస్త్రజ్ణుడు)తెలిపారు. ఈ చెట్ల నరికివేత చాలా పక్షులు మరియు జంతువుల ఆవాసాలపై క్యాస్కేడింగ్ ప్రభావాన్ని చూపుతుందని ఆయన అన్నారు. చెట్ల నరికివేత నిర్ణయం పర్యావరణ విపత్తు అని అన్నారు. ఇది నేల కోతకు దోహదం చేస్తుంది మరియు ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుందన్నారు. వీటన్నింటినీ మరియు గ్రీన్ కవర్ కోల్పోవడాన్ని ఎవరు భర్తీ చేస్తారు అని మౌహీమ్ ప్రశ్నించారు.

నిర్ణారణకు ఎటువంటి శాస్త్రీయ అధ్యయం లేదు

2014లో ఓ కోర్టు ఆదేశాల ప్రకారం…కశ్మీర్ ప్రభుత్వం 26వేల ఇలాంటి చెట్లను నరికివేసింది. ఆ చెట్లనుండి వెలవడే బీజరేణువులు శ్వాససంబంధిత సమస్యలను సృష్టిస్తుందని ఆరోపిస్తూ దాఖలు చేసిన ఓ పిటిషన్ మేరకు కోర్టు అప్పుడు ఆ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ చెట్లు విడుదల చేసే బీజరేణువులు శ్వాససంబంధిత సమస్యలకు కారణమని నిర్థారిచడం “అతిశయోక్తి”గా స్థానిక మెడికల్ కాలేజీ అభివర్ణించింది. ఒక అధ్యయనం ప్రకారం…. గృహాలలో ధూళి కణాల వల్ల శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయని కనుగొనబడింది. 

తక్కువ ఖర్చుతో కలపగా ప్రసిద్ది చెందిన పోప్లార్ చెట్టును రూఫింగ్ ర్యాఫ్టర్స్ కు మరియు యాపిల్, బేరి మరియు పీచు వంటి విలువైన ఉద్యాన ఉత్పత్తులను రవాణా చేయడానికి ఉపయోగించే క్రేట్ లు(డబ్బాలు)తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ చెట్లను భారీగా నరికివేయాలని ప్రభుత్వం ఆదేశించడం ద్వారా పేదల జీవనోపాధిపై ప్రభుత్వం కోత పెడుతోందని పుల్వామా జిల్లాలోని రైతు షబాన్ అక్బర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read | గుట్టలు గుట్టలుగా కరోనా శవాలు, సామూహిక దహనాలు.. న్యూయార్క్ లో ఎందుకిలా