“నేషనలిజం” పదం పలకవద్దు…కొత్త వివాదానికి తెరదీసిన RSS చీఫ్

మరో వివాదానికి తెరసీంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో కనిపిస్తోన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ సారి నేషనలిజం అనే పదాన్ని ఎక్కడా పలకవద్దంటూ అంటూ ప్రజలకు పిలపునిచ్చారు. నేషనలిజం పదంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన మోహన్ భగవత్…ఆ పదం ఉచ్ఛరించవద్దంటూ పిలుపునివ్వడానికి గల కారణాలనూ తన కోణంలో చెప్పుకొచ్చారు.

గురువారం(ఫిబ్రవరి-20,2020)జార్ఖండ్ రాజధాని రాంచీలో RSSనిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మోహన్ భగవత్ మాట్లాడుూ….. భారత్‌లో నివసించే ప్రతి పౌరుడూ జాతీయ గీతానికి, జాతీయ జెండాకు తలవంచి తీరాల్సిందేనని, గౌరవించాల్సిందేనని అన్నారు. పుట్టిన గడ్డకు రుణపడి ఉండాలని, అదే భావాన్ని, అభిమానాన్ని చివరి వరకూ ప్రదర్శించాలని సూచించారు. 

అయితే ఈ సందర్భంగా నేషనలిజం అనే పదంపై భగవత్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా యూకేలో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్తకు, తనకు మధ్య జరిగిన నేషనలిజం పదం గురించి జరిగిన సంభాషణను మోహన్ భగవత్ గుర్తుచేసుకున్నారు. నేషనలిజం అనే  పదం అడాల్ఫ్ హిట్లర్‌ యొక్క నాజిజమ్ ను సూచిస్తోందని మోహన్ భగవత్ అన్నారు. హిట్లర్‌, నాజీయిజానికి ప్రతిబింబించేలా నేషనలిజం అనే పదం ఉందని అన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా నేషన్, నేషనల్, నేషనాలిటి అనే పదాలను పలకాలని ప్రజలుకు సూచించారు. హిట్లర్, నాజీయిజం, నేషనలిజం.. ఈ మూడు ఒకే అర్ధాన్ని ఇస్తాయనీ చెప్పారు.

ఫండమెంటలిజం(ఛాందసవాదం)కారణంగా దేశవ్యాప్తంగా అశాంతి నెలకొని ఉందని ఈ సందర్భంగా భగవత్ తెలిపారు. దేశంలో వైవిధ్యత ఉన్నప్పటికీ దేశంలోని ప్రతి వ్యక్తి మరో వ్యక్తితో కనెక్ట్ అయి ఉన్నట్లు  తెలిపారు. భారత్ ను ప్రపంచానికి లీడర్ గా మార్చడమే తమ అంతిమ లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ విస్తరించబడుతుందన్నారు. హైందవ సమాజాన్ని ఏకం చేయడం మినహా ఆర్ఎస్ఎస్‌కు మరో పని లేదని అన్నారు. ప్రతి ఒక్కరిలోనూ హిందుత్వ, జాతీయ భావాలను పెంపొందించడం, పీడిత రహిత సమాజాన్ని స్థాపించడం మినహా మరో లక్ష్యం తమకు లేదని చెప్పారు. ఆర్ఎస్ఎస్ భావజాలన్ని అనుసరించేలా చేయాల్సిన అవసరం ఉందని భగవత్ అన్నారు.

ఆర్ఎస్ఎస్…కేంద్ర ప్రభుత్వాన్ని సైతం శాసించే స్థాయిలో ఉందని, తన కనుసన్నల్లోకి ప్రభుత్వాలను తీసుకుని వచ్చిందనే విషయాన్ని ఆయన తోసిపుచ్చారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో గానీ, పాలకుల వ్యవహారాల్లో గానీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని మోహన్ భగవత్ తేల్చి చెప్పారు. ప్రభుత్వ పెద్దల అండదండలేవీ లేకుండానే.. తాము తమ గమ్యాన్ని చేరుకుంటామని భగవత్ తెలిపారు.

Read More>>తిరుపతి రుయా ఆస్పత్రిలో నలుగురు సైకోల హల్‌చల్: బ్లేడులతో కోసుకుని వీరంగం..

ట్రెండింగ్ వార్తలు