Ghulam Nabi Azad: ఆజాద్‌కు పద్మభూషణ్ అవార్డు.. ‘బానిస’ అంటూ కాంగ్రెస్ విమర్శలు

రిపబ్లిక్ డే సందర్భంగా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది కేంద్రం.

Ghulam Nabi Azad: రిపబ్లిక్ డే సందర్భంగా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఈ విషయమై ఆజాద్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు రకాల స్పందన వస్తోంది. రాజ్ బబ్బర్, శశి థరూర్ వంటి నేతలు ఆజాద్‌కు పద్మ అవార్డుపై అభినందనలు తెలుపుతుంటే.. జైరాం రమేష్ మాత్రం విమర్శలు గుప్పించారు.

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీకి కూడా పద్మభూషణ్ రాగా.. ఆ గౌరవాన్ని స్వీకరించడానికి నిరాకరించారు భట్టాచార్య. భట్టాచార్య నిర్ణయంపై మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేష్ ట్విట్టర్‌లో, ‘భట్టాచార్య అలా చేయడం కరెక్టే.. అతను ఆజాద్ (స్వతంత్రుడు) గులాం (బానిస) కాదు’ అంటూ ట్వీట్ చేశారు.

“He wants to be Azad not Ghulam” అంటూ గులాం నబీ ఆజాద్ అనే పేరు వచ్చేలా ట్వీట్ చేశారు. గులాం నబీ ఆజాద్‌‌కు పద్మభూషణ్ ఇవ్వడంపై కపిల్‌ సిబల్‌ కూడా వ్యంగ్యంగా స్పందించారు. ఆజాద్‌ సేవలను దేశం గుర్తిస్తున్నప్పుడు కాంగ్రెస్‌కు ఆయన సేవలు అవసరం లేదు
అన్నారు కపిల్‌ సిబాల్‌.

ట్రెండింగ్ వార్తలు