‘బగీరా’అనగానే జంగిల్ బుక్ సినిమా ఠక్కున గుర్తుకొస్తుంది. ఈ యానిమేషన్ సినిమా చాలా క్రేజ్ సంపాదించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘బగీరా’ అంటే నల్ల చిరుత. అటువంటి చిరుతలు యానిమేషన్ సినిమాలో మాత్రమే ఉంటుందని అనుకున్నాం.కానీ ఇప్పుడు కర్ణాటకలోని అడవుల్లో ఓ నల్లచిరుత సంచరిస్తోందన్న వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
నల్లచిరుతలు కనిపించడం చాలా అరుదు. అలాంటిది కర్ణాటకలోని అడవుల్లో ఓ నల్లచిరుత సంచరిస్తోందన్న వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ షాజ్ జంగ్ ఈ చిరుతకు సంబంధించిన ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కబినీ అటవీ ప్రాంతంలో ఈ చిరుతను తాను చూసినట్లు ఆయన తన ట్వీట్‌లో తెలిపారాయన.
అయితే నల్లచిరుత ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దాదాపు 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకున్నాయి. ఈ ఫోటోలను చూసిన ప్రతి ఒక్కరూ జంగిల్ బుక్ కామిక్‌లోని బగీరా ఇదేనంటూ చమత్కరిస్తున్నారు. జంగిల్ బుక్‌లో మాదిరిగా భారత్‌లో నిజంగా బగీరా కనిపించిందని మరొక నెటిజన్ రాసుకొచ్చాడు. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటివి చూడాలని..ప్రకృతిని ఆస్వాదించాలని ఇంకో నెజినజ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన అభిప్రాయాన్ని తెలిపారు.
Read Here>>వరుసగా 5వ రోజు 20వేలకు పైగా కేసులు..