Hostel Canteen Food: నో నాన్‌వెజ్.. అక్కడి హాస్టల్స్, క్యాంటిన్లలో మాంసాహారం నిషేదం.. కారణమేమంటే?

కరోనా మహమ్మారి తర్వాత ఢిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీ క్యాంటీన్, హాస్టల్‌లో మాంసాహారాన్ని అందించడం నిలిపివేసింది. అయితే, ఈ విషయంపై ప్రిన్సిపాల్ ను ప్రశ్నించగా. గత నాలుగేళ్లుగా ఇదే విధానం కొనసాగుతుందని తెలిపారు. అయితే, ఈ విషయంపై విద్యార్థుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఆమె తెలిపారు.

Hansraj College

Hostel Canteen Food: ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని హన్స్‌రాజ్ కాలేజీ క్యాంటిన్, హాస్టల్ లో మాంసాహారాన్ని అందించడం లేదు. కరోనా మహమ్మారి తరువాత గత ఏడాది ఫిబ్రవరిలో కళాశాల క్యాంపస్ తెరచుకుంది. అప్పటి నుంచి వెజ్ మాత్రమే అందిస్తున్నారు. ఇదే విషయంపై ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమ మాట్లాడుతూ… దాదాపు నాలుగేళ్లుగా కాలేజీ క్యాంటిన్, హాస్టల్ లో నాన్ వెజ్ అందించడం లేదని తెలిపారు. దీనిని పరిగణలోకి తీసుకొని కొవిడ్ అనంతరం కళాశాల తెచురుకున్న తర్వాతకూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు.

 

నాన్ వెజ్ పెట్టడం లేదని నిర్ణయం తీసుకొనే సమయంలో కమిటీ విద్యార్థులను సంప్రదిస్తే బాగుండేది. అయినా, ఇప్పటి వరకు నాన్ వెజ్ అందించడం లేదని ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఇదే సమయంలో మాంసాహారం అందిస్తామనే హామీతో ఏ విద్యార్థికి అడ్మీషన్ ఇవ్వలేదని కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. మాంసాహారం తినాలనిపించే విద్యార్థులపై ఎటువంటి నిషేధంలేదు. నాన్ వెంజ్ తినాలనుకునేవారు బయట తినవచ్చునని తెలిపారు.

 

గత ఏడాది జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్టీయు)లో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. శ్రీరామ నవమి రోజు కాలేజీ క్యాంటిన్ లో లెఫ్ట్ పార్టీ సానుభూతిపరులు కొందరు మాంసాహారంతో భోజనం చేస్తున్నారు. దీంతో ఏబీవీపీకి చెందిన విద్యార్థులు అడ్డుకోవటంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని, ఇలాంటి ఘటనలు కళాశాలలో పునరావృతం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హంసరాజ్ కాలేజ్ యాజమాన్యం తెలిపింది.