Congress Party : కాంగ్రెస్‌ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసిన ఐటీశాఖ.. గంట తరువాత పునరుద్ధరణ

ఆధాయ పన్నుశాఖ తీరుపై కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.

Congress Party

Treasurer Ajay Maken: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన మొత్తం తొమ్మిది అకౌంట్లను ఆదాయ పన్ను శాఖ విభాగం సీజ్ చేసింది. 2018-19 లో ఆదాయ పన్ను శాఖ విధించిన జరిమానా, నోటీసులకు ఇప్పటి వరకు స్పందించలేదని పేర్కొంటుూ.. అకౌంట్లు సీజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ, అనుబంధ విభాగాలకు సమాచారం పంపించింది.

Also Read : ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయొద్దు.. ప్రభుత్వానికి కడియం సూచన.. క్లారిటీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి

ఆధాయ పన్ను శాఖ తీరుపై కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎలాంటి చెక్కులను తీసుకోవద్దని ఐటీ శాఖ బ్యాంకులకు ఆదేశాలిచ్చిందని అన్నారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. రూ. 210 కోట్ల పన్ను కట్టాలని ఐటీ డిమాండ్ చేస్తోందని, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న విరాళాల చెక్కులు బ్యాంకుల్లో జమ కావడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు కాదు.. దేశ ప్రజాస్వామ్యం ఫ్రీజ్ అయిందని మాకెన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అకౌంట్లలో ఉన్న డబ్బు కార్పొరేట్లది కాదు.. కార్యకర్తలు, విరాళాలు, మెంబర్ షిప్ ద్వారా వచ్చిన డబ్బు అని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన డబ్బుని బీజేపీ ఖర్చు చేసుకుంటుంది.. కాంగ్రేస్ ఖాతాలను మాత్రం స్తంభింపజేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఒకే పార్టీ ఉండాలా? ఇతర పార్టీలు ఉండొద్దా అంటూ మాకెన్ ప్రశ్నించారు. 2018-19 ఆదాయ పన్ను రిటర్న్స్ ఆధారంగా ఖాతాలు ఫ్రిజ్ చేశామని చెప్తున్నారని అన్నారు. ఇప్పటికే ఢిల్లీలోని ఇన్ కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యూనల్ ను (ఐటీఏటీ) కేసు వేశామని తెలిపారు. భారత న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ చెప్పారు.

Also Read : గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి.. స్కామ్‌లు చేసేవారికే దిమ్మతిరిగే స్కామ్ ఇది

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. అధికార మత్తులో కూరుకుపోయిన మోడీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ – భారత జాతీయ కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గట్టి దెబ్బ అని అన్నారు. బీజేపీ వసూలు చేసిన రాజ్యాంగ విరుద్దమైన సొమ్ము ఎన్నికల్లో వినియోగిస్తారు.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా కాంగ్రెస్ సేకరించిన డబ్బును ఫ్రీజ్ చేస్తారు. అందుకే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని చెప్పాం. ఈ దేశంలో బహుళ – పార్టీ వ్యవస్థను కాపాడాలని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము న్యాయవ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అన్యాయం, నియంతృత్వ పాలనపై వీధుల్లోకి వచ్చి గట్టిగా పోరాడతాం అని మల్లికార్జున ఖర్గే అన్నారు.

ఇదిలాఉంటే.. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చిన గంట తరువాత ఆ పార్టీకి ఉపశమనం లభించింది. అకౌంట్లను ఆదాయ పన్నుశాఖ పునరుద్ధరించింది.

 

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు