ఖాతాదారులకు అలర్ట్, వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్

బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. బ్యాంకులో ఏవైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. మార్చి 12(రెండో శనివారం), 14(ఆదివారం), 15(సోమవారం-సమ్మె), 16(మంగళవారం-సమ్మె).

bankers-on-strike

bankers on strike: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. బ్యాంకులో ఏవైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. మార్చి 12(రెండో శనివారం), 14(ఆదివారం), 15(సోమవారం-సమ్మె), 16(మంగళవారం-సమ్మె).

బ్యాంకు యూనియన్లు మరోసారి సమ్మెకు దిగుతున్నాయి. మార్చి 15, 16 తేదీల్లో సమ్మెను ప్రకటించాయి. రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేయబోతున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్-UFBU సమ్మె నిర్వహించబోతున్నట్టు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్-IBA ప్రకటించింది.

మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకు సిబ్బంది సమ్మెకు దిగితే వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడతాయి. మార్చి 15 సోమవారం, మార్చి 16 మంగళవారం కాగా అంతకన్నా ముందు మార్చి 13 రెండో శనివారం, మార్చి 14 ఆదివారం ఉన్నాయి. దీంతో మార్చి 13 నుంచి 16 వరకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు తెరుచుకోవు.

వాస్తవానికి.. ఈ నెలలో బ్యాంకులకు 5 రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 11న మహాశివరాత్రి. మార్చి 15, 16వ తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ రెండు రోజులు బ్యాంకులు పని చేయవు. మార్చి 11 నుంచి 16వ తేదీ వరకు మార్చి 12న ఒక్క రోజే బ్యాంకులు పని చేస్తాయన్నమాట.

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్-AIBEA, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్-AIBOC, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్-NCBE, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్-AIBOA, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-BEFI, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కెనెరా బ్యాంక్ ఎంప్లాయీస్ కాంగ్రెస్-INBEF, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్-INBOC, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్-NOBW, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్-NOBO, ఆల్ ఇండియా నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ కెనెరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్-AINBOF ఈ సమ్మెలో పాల్గొంటాయి.

పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బ్యాంకు యూనియన్లు సమ్మెను ప్రకటించాయి. గత నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనమయ్యాయి. కాగా, బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని యూనియన్లు తప్పుపడుతున్నాయి. నష్టాల పేరుతో బ్యాంకులను అమ్మేయడం సమంజసం కాదంటున్నాయి. నష్టాలను తగ్గించి లాభాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఇలా ప్రతి దాన్ని అమ్ముకుంటూ పోతే ఎలా అని బ్యాంకు యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి.