Basavaraj Bommai: సీఎంగా మాజీ సీఎం కొడుకు.. టాటాలో ఇంజనీర్.. బసవరాజు బొమ్మై ఎవరు?

కర్నాటక రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైని ప్రకటించింది. లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన బొమ్మై కర్నాటకకు యడియూరప్ప వారసుడిగా 30వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

Basavaraj Bommai: కర్నాటక రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైని ప్రకటించింది. లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన బొమ్మై కర్నాటకకు యడియూరప్ప వారసుడిగా 30వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడే బసవరాజు. జనతా దళ్‌ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన బసవరాజు 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008లో బీజేపీలో చేరి పార్టీలో కీలకమైన స్థానానికి చేరుకున్నారు. షిగ్గావి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

యడియూరప్ప మంత్రివర్గంలో హోంమంత్రిగా పనిచేసిన బొమ్మై టాటా గ్రూప్‌లో ఇంజనీర్‌గా కూడా పని చేశారు. రెండు, మూడు రోజుల్లో బొమ్మై ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్‌ బొమ్మై అయితేనే తర్వాతి కాలంలో రాజకీయంగా బీజేపీకి మంచిదని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈమేరకు నిర్ణయం తీసుకుంది. 2023 ఎన్నికలే టార్గెట్‌గా అధిష్టానం పావులు కదిపినట్లుగా కనిపిస్తోంది.

హవేరి జిల్లాలోని షిగ్గావి నియోజకవర్గ శాసనసభ్యుడైన బసవరాజు బొమ్మైని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా తర్వాతి ముఖ్యమంత్రి స్థానానికి ప్రతిపాదించారు. ఆ విధంగా బొమ్మై ప్రభుత్వం కర్నాటకలో రాబోతుంది. కర్ణాటక రాజకీయ చరిత్రలో ఇది రెండవ అరుదైన క్షణం. హెచ్.డి. దేవేగౌడ కుమారుడు HD కుమారస్వామి సీఎం అయ్యాక, మరోసారి ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడు బసవరాజు బొమైకి ముఖ్యమంత్రిగా అవకాశం దక్కింది.

ట్రెండింగ్ వార్తలు