Basavaraj Bommai: కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై

కర్నాటక సీఎం ఎవరు..? అనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దోరికింది. యడ్డీ నిశ్ర్కమణతో ఖాళీ అయిన ఆ ప్లేస్‌లోకి బసవరాజు బొమ్మైని నియమిస్తూ బిజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

Basavaraj Bommai New Karnataka CM: కర్నాటక సీఎం ఎవరు..? అనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. యడ్డీ నిష్క్రమణతో ఖాళీ అయిన ఆ ప్లేస్‌లోకి బసవరాజు బొమ్మైని రాబోతున్నారు. ఈమేరకు బిజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. కర్నాటక రాజకీయ వ్యవహారంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌లను కేంద్ర పరిశీలకులుగా పార్టీ నిర్ణయించగా.. బెంగళూరుకు వెళ్లిన వారు పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జిరిపి, అందరి సూచనల మేరకు ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీవర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ నిర్ణయంతో కర్నాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై కానున్నారు. ప్రస్తుతం బొమ్మై కర్నాటక హోంమంత్రిగా ఉన్నారు. ఆయననే సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు యడియూరప్ప సుముఖత వ్యక్తం చేశారు. లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్‌ బొమ్మై అయితేనే తర్వాతి కాలంలో రాజకీయంగా మంచి స్టెప్పులు వేసినట్లుగా అవుతుందని బీజేపీ అభిప్రాయం. మాజీ సీఎం ఎస్‌.ఆర్‌.బొమ్మై కుమారుడే బసవరాజ్‌ బొమ్మై.

2023 ఎన్నికలే టార్గెట్‌గా అధిష్టానం పావులు కదిపినట్లుగా అక్కడి రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లింగాయత్ వర్గానికే మరోసారి అవకాశం ఇవ్వడంతో ఎన్నో ఏళ్లుగా బీజేపీకి స్థిరమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఆ వర్గం పార్టీకి దూరం అవ్వదనే అబిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. కొత్త ప్రయోగాలకు తెరదీస్తే భవిష్యత్తులో బీజేపీ అధికారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, అందుకే బొమ్మైకి పగ్గాలు అందించినట్లు భావిస్తున్నారు.

లింగాయత్ సామాజికవర్గానికి సీఎం పదవి కట్టబెట్టినా.. ఇతర వర్గాలు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉండటంతో నాలుగు ప్రధాన సామాజికవర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టే ఆలోచనలో కూడా బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో లింగాయత్, దళిత్, వొక్కలిగ వర్గాల నుంచి ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండగా.. కురబ సామాజికవర్గానికి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు