గూగుల్ పే వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీకు Good News అంటూ ఏదైనా మెసేజ్ వచ్చిందా? అయితే మీ అకౌంట్లో డబ్బులు పోయినట్టే. ఓసారి మీ బ్యాంకు అకౌంట్ చెక్ చేసుకోండి. నగదు ఉందో మాయమైందో.. ఇదంతా సైబర్ మోసగాళ్ల ఎర వేస్తున్నారని గుర్తించుకోండి. కొన్నిరోజుల నుంచి ‘Google Pay వినియోగదారులకు శుభవార్త’ అంటూ ఓ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ మెసేజ్ కు మోసపోయి Links క్లిక్ చేసి లక్షల్లో నష్టపోయారు.
Scratch Cardను రూ.500 నుంచి రూ.5000 వరకూ గెలుచుకోవచ్చు’ అని గూగుల్ పేకు Links ఫోన్‌కు మెసేజ్, వాట్సాప్ రూపంలో వస్తున్నాయి. ఇదెదో బంపర్ ఆఫర్ అంటూ ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మీ అకౌంట్ ఖాళీ కావడం ఖాయమే అని హెచ్చరిస్తున్నారు సైబర్ అధికారులు.
గూగుల్ పే నుంచి ఒక స్క్రాచ్ కార్డు వస్తుంది. కార్డును ఓపెన్ చేసిన వారికి కొంతమొత్తంలో నగదు కనిపిస్తుంది. ఈ నగదు మీ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయాలంటే మీ KYC వివరాలు అప్‌లోడ్ చేయండి అని ఉంటుంది. కానీ, డబ్బు మాత్రం ఖాతాలో జమ కాదు. ఆశపడి మీ వివరాలు ఇచ్చారో అంతే సంగతులు మీ బ్యాంకు అకౌంట్ హ్యాకర్ల చేతుల్లోకి పోయినట్టే. సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసిన మోసపూరితమైన లింక్‌లని, వాటిని క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే బ్యాంక్ ఖాతాలోని సొమ్ము కాజేస్తారని పేర్కొన్నారు.
రూ.5.29 లక్షలు పొగట్టుకున్న డాక్టర్
సైబరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ డాక్టర్‌కు అక్టోబర్ 21న ఎస్‌ఎంఎస్ వచ్చింది. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం.. వెంటనే మీ కేవైసీ, ఖాతా వివరాలు అప్‌డేట్ చేయాలి.. లేకపోతే నిలిపివేస్తాం, డెబిట్ కార్డు పనిచేయదు అని దాని సారాంశం. ఆ మెసేజ్‌తోపాటు గూగుల్ లింక్ పంపారు. డాక్టర్ అనుమానించకుండా గూగుల్ లింక్ ఓపెన్ చేసి వివరాలు నింపారు. అవన్నీ సైబర్ నేరగాళ్లకు చేరాయి. నిమిషాల్లో డాక్టర్ ఖాతాలో ఉన్న రూ. 5.29 లక్షలు కాజేశారు.