Beer Bomb
Beer lovers: రష్యా-యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా బీర్ల ధరలు భారీగా పెరగబోతున్నాయా? అవుననే సమాధానమే వినిపిస్తోంది. మద్యాన్ని తయారు చేసేందుకు ఉపయోగించే కీలకమైన బార్లీ ధరలు, సరఫరాలపై యుక్రెయిన్ రష్యా యుద్ధం ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో బీర్ ధరలు భారీగా పెరగనున్నాయని చెబుతున్నారు.
అమెరికా, కెనడాతో పాటు ఇతర దేశాల్లో ఇప్పటికే రష్యా బ్రాండెడ్ స్పిరిట్‌లను బహిష్కరించడంతో వోడ్కా ధర భారీగా పెరిగింది. రష్యా ప్రపంచంలో బార్లీని ఉత్పత్తి చేసే రెండవ అతిపెద్ద దేశం. యుక్రెయిన్ ప్రపంచవ్యాప్తంగా మాల్ట్ నాల్గవ అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్‌గా ఉంది. యుద్ధ సంక్షోభం తీవ్రమైతే బార్లీ ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
భారతదేశం కూడా బార్లీని ఉత్పత్తి చేయడంలో ముందుండగా.. దేశంలోని అనేక బ్రేవరీలు బార్లీ దేశీయ ఉత్పత్తిపై ఆధారపడి ఉన్నాయి. అంతర్జాతీయ బార్లీ ధరలు పెరగడం వల్ల దేశీయంగా ధరలపై ప్రభావితం అవ్వొచ్చని అంటున్నారు. ప్రస్తుతానికైతే ప్రభావం లేదని, యుద్ధం ఇంకా కొనసాగితే మాత్రం కచ్చితంగా ప్రభావం ఉంటుందని తెలుస్తుంది.