Save Elephant : ఏనుగు ప్రాణాలు కాపాడిన లోకో పైలెట్లు

ఓ రైలు లోకోపైలెట్‌లు గ‌జ‌రాజును ర‌క్షించారు. అప్ర‌మ‌త్తంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆ ఏనుగు ప్రాణాలు కాపాడారు. న‌గ్ర‌క‌ట‌-చ‌ల్సా మార్గంలో వెళ్తున్న ఓ స్పెష‌ల్ ట్రెయిన్

Save Elephant

Save Elephant : ఓ రైలు లోకోపైలెట్‌లు గ‌జ‌రాజును ర‌క్షించారు. అప్ర‌మ‌త్తంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆ ఏనుగు ప్రాణాలు కాపాడారు. న‌గ్ర‌క‌ట‌-చ‌ల్సా మార్గంలో వెళ్తున్న ఓ స్పెష‌ల్ ట్రెయిన్‌ ఉత్త‌ర బెంగాల్‌లోని జ‌ల్పాయ్‌గురి జిల్లా ప‌రిధిలోకి వ‌చ్చేస‌రికి ట్రాక్ ప‌క్క‌న ఓ ఏనుగు నిల‌బ‌డి ఉంది. దూరం నుంచి దాన్ని గ‌మ‌నించిన ఇద్దరు లోకోపైలెట్లు వెంట‌నే అలర్ట్ అయ్యారు.

COVID-19 ఇన్ఫెక్షన్.. అత్యంత తీవ్రమైన అంటువ్యాధిగా ఎప్పుడు మారుతుందంటే?

ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును నిలిపేశారు. ఏనుగు ట్రాక్ ద‌గ్గ‌రి నుంచి అడ‌వి లోప‌లికి వెళ్లేవ‌ర‌కు వేచి చూశారు. ఏనుగు వెళ్లిపోయాక రైలును ముందుకు పోనిచ్చారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాల‌ను అలీపూర్‌ద్వార్ డివిజ‌న్ అధికారులు ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.

BH-series : రాష్ట్రం మారినా వాహన రిజిస్ట్రేషన్​ మార్చనక్కరలేదు..ఒకే నంబర్ దేశమంతా తిరగొచ్చు..

ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు లోకో పైలెట్‌ల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. స‌మయానికి అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించి ఏనుగు ప్రాణాల‌ను కాపాడారంటూ మెచ్చుకుంటున్నారు. రైల్వే శాఖ కూడా ఆ ఇద్ద‌రు లోకో పైలెట్‌ల‌ను అభినందించింది.