పోర్న్‌సైట్‌లో అమ్మాయిల ఫోటోలు పోస్ట్ చేసిన ఇద్దరు అరెస్ట్

  • Publish Date - July 31, 2020 / 07:56 AM IST

కాలేజీ అమ్మాయిల 30 ఫోటోలను అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కాలేజ్ బాలికల ఫోటోలను అప్‌లోడ్ చేసినందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని 66, 67 సెక్షన్ల కింద అజయ్ రాజగోపాల్, విశ్వక్ సేన్ (27) లను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ జైన్ తెలిపారు.



బాధితుల ఫోటోలను వారి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తీసుకున్నట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. ఈ కేసులో ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
విశ్వక్ సేన్ అనే కాలేజీ విద్యార్థి, రాజగోపాల్ (37) పెళ్లికాని వారితో చాట్ చేసేవాడు, నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్ ఉపయోగించి అమ్మాయిలుగా మాట్లాడేవారు.



సోషల్ నెట్‌వర్క్‌లో కళాశాల విద్యార్థినులు అప్‌లోడ్ చేసిన ఫోటోలు దొంగిలించి అశ్లీల వెబ్‌సైట్లలో ఫోటోలు షేర్ చేసేవారు. పోలీసులు కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేయగా.. బెంగళూరు సైబర్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుల ఐపీ అడ్రెస్ ద్వారా పోలీసులు మూడు రోజుల్లో కేసును ఛేదించారు.