Omicron Variant : బెంగళూరులో ఒమిక్రాన్ కలకలం.. బాధిత వ్యక్తి నుంచి మరో ఐదుగురికి పాజిటివ్!

బెంగళూరులో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి కాంటాక్ట్స్ కు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాంటాక్టులో ఉన్న ఐదుగురికి కూడా పాజిటివ్ వచ్చింది.

Omicron Variant : బెంగళూరులో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి కాంటాక్ట్స్ కు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాంటాక్టులో ఉన్న ఐదుగురికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. వీరికి సంబంధించిన శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అధికారులు పంపించినట్టు తెలుస్తోంది. ఐదుగురిలో ముగ్గురు ప్రైమరీ కాంటాక్ట్స్, ఇద్దరు సెకండరీ కాంటాక్ట్స్ ఉన్నట్టు గుర్తించారు.

ప్రస్తుతానికి ఆ ఐదుగురిని వెంటనే ఐసోలేషన్‌లో ఉంచినట్టు కర్నాటక ప్రభుత్వం వెల్లడించింది. 46ఏళ్ల బెంగళూరు హెల్త్ వర్కర్‌కి నవంబర్ 22న కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే రోజున బాధిత వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. మూడ్రోజుల అనంతరం ఆ హెల్త్ వర్కర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయినట్టు అధికారులు తెలిపారు. అతడి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా ఫలితాలు రావాల్సి ఉంది.

ఇప్పటికే.. కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. 46ఏళ్లు, 66 ఏళ్లు వయస్సు ఉన్న వ్యక్తులకు ఈ వేరియంట్ సోకిందని తెలిపింది. ఇటీవలే విదేశాల నుంచి బెంగళూరుకు వచ్చారని, ప్రైమరీ కాంటాక్ట్స్ క్వారంటైన్‌కు తరలించినట్టు తెలిపింది. ఇండియాలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిపై కేంద్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒమిక్రాన్ గురించి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రతి ఒక్కరూ మునపటిలానే కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

Read Also : Omicron Scare : ఇండియాలోకి ఒమిక్రాన్.. భయం వద్దు.. జాగ్రత్తలు మరువద్దు!

ట్రెండింగ్ వార్తలు