Swiggy 2022 biggest order
Swiggy : ఒక్క క్లిక్ ఒకే క్లిక్ తో నెట్టింట్ ఆర్డర్ చేస్తూ నట్టింటకొచ్చి వాలుతున్నాయి ఫుడ్ ఐటెమ్స్. స్విగ్గి, జొమాటో ఇలా ఎన్నో సంస్థలు ఇలా ఆర్డర్ చేస్తూ అలా డెలివరీ చేసేస్తున్నాయి. ఇలా బిర్యానీ,పిజ్జా, నూడుల్స్ ఏమైనా సరే ఆర్డర్ పెట్టామంటే చాలు డెలివరీ బాయ్స్ ఇంటిముందుకొచ్చి వాలుతున్నారు. అలా 2022లో సిగ్గీకి వచ్చిన అతి పెద్ద ఆర్డర్ ఎంతో తెలుసా? అక్షరాలు రూ.16లక్షలు. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ పామ్ ‘స్విగ్గీ’ తన యూజర్ల నుంచి 2022 ఏడాదిలో వచ్చిన ఆర్డర్ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఈ విషయాల్లో తమకు 2022లో వచ్చిన అతి పెద్ద ఆర్డర్ విలువ రూ.16.6 లక్షలు అని తెలిపింది. భారత దేశ వ్యాప్తంగా స్విగ్గీకి నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ వచ్చాయట. ఇంకా రోజురోజుకు మరెన్నో కొత్త వంటకాలు ఆన్లైన్ డెలివరీలో అందుబాటులోకి వస్తున్నా..ప్రజల ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్ బిర్యానీయే అని తెలిపింది స్విగ్గీ.
కాగా 2022లో అతి పెద్ద ఆర్డర్ గురించిన వివరాల్లోకి వెళితే..ఇన్ స్టా మార్ట్ పేరుతో స్విగ్గీ ఓ గ్రోసరీ ప్లాట్ ఫామ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ పై 2022లో వచ్చిన అతిపెద్ద ఆర్డర్ విలువ రూ.16.6 లక్షలు అని తెలిపింది.ఈ ఆర్డర్ ని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి చేశారని తెలిపింది.
బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి దీపావళి పండుగ సందర్భంగా స్విగ్గీపై రూ.75,378 విలువైన కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేశాడట. పూణెకు చెందిన ఓ వ్యక్తి రూ.71,229 విలువైన బర్గర్లు వంటి ఫుడ్ ఐటెమ్స్ తన సిబ్బంది కోసం ఆర్డర్ చేశాడట.
కస్టమర్ ఆర్డర్ పెట్టిన కేవలం 1.03 నిమిషానికే అతడి చేతిలో డెలివరీ ప్యాక్ పెట్టేసింది. ఇంత తక్కువ సమయంలోనే ఇది ఎలా పాజిబుల్ అయ్యిందీ అంటే ఇన్ స్టా మార్ట్ స్టోర్‌కు ఆర్డర్ పెట్టిన కస్టమర్ ఇల్లు కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉండటంతో అది సాధ్యమైందని స్విగ్గీ తెలిపింది.
Zomato 2022 : జొమాటోలో ఢిల్లీవాసి జోరు .. రోజుకు 9, ఏడాదికి 3,300 ఫుడ్ ఆర్డర్లు చేసిన ఒకే ఒక్కడు