Rainbow Halo : కనువిందు చేసిన సూర్యుడు, ఫొటోలు వైరల్

బెంగళూరు నగరంలో ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. గంటపాటు ఉన్న ఈ దృశ్యం నగర వాసులను ఆశ్చర్యచకితులను చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

Sun

Rare Rainbow Coloured Halo : బెంగళూరు నగరంలో ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. గంటపాటు ఉన్న ఈ దృశ్యం నగర వాసులను ఆశ్చర్యచకితులను చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఎంతో అద్భుతమైన దృశ్యం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలా మందికి ఇంధ్రదనస్సు అంటే ఎంతో ఇష్టం. ఆకాశంలో కనిపించగానే..కేరింతలు కొడుతారు. బెంగళూరు నగరంలో కూడా అచ్చు ఇలాగే జరిగింది.

2021, మే 24వ తేదీ సోమవారం సూర్యుడిని కప్పేస్తూ..ఇంధ్రదనస్సు వలే రంగులు కనిపించాయి. దాదాపు గంట పాటు బెంగళూరు ప్రజలను కనువిందు చేసింది. ఆకాశంలో ఈ అద్భుత దృశ్యాన్ని తమ సెల్ ఫోన్ లు, కెమెరాలలో బంధించారు. ఈ విధంగా కనిపించడాన్ని 22 డిగ్రీల హాలో అంటారని పలువురు వెల్లడించారు. ఇది కాంతిని చెదరగొట్టడం వల్ల ఏర్పడే అవకాశం ఉందని, కాంతి యొక్క వృత్తాకారంలో సూర్యుడు లేదా చంద్రుడు చుట్టూ కనిపిస్తుందంటారు.

వాతావరణంలో ఏర్పడే మంచు స్ఫటికాల ద్వారా కాంతి ప్రతిబింబించి..వక్రీభవనం వలన హాలో సంభవిస్తుంది. హాలో అనేది సూర్యుడు లేదా చంద్రుడు నుంచి 22 డిగ్రీల కాంతి వలయం అని, మంచు స్పటికాలతో ఏర్పడే అత్యంత సాధారణమైన కాంతి రకమని నిపుణులు వెల్లడిస్తున్నారు. మంచు స్పటికాల గుండా వెళుతున్న సమయంలో…కాంతి రెండు వక్రీభవనాలకు లోను కావడం జరుగుతుందన్నారు.


22 డిగ్రీల కోణంలో వంగి..సూర్యుడు లేదా చంద్రుడు చుట్టూ కాంతి వలయాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు. ఇలాగే..బెంగళూరు నగరంలో కనిపించిందన్నారు. మొత్తానికి ఆకాశంలో జరిగిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసి నగర ప్రజలు ఎంజాయ్ చేశారు.

Read More :  Bengaluru : లాక్ డౌన్ ఉల్లంఘన, లాఠీ దెబ్బలు కాదు..కొత్త పూజ