Bengaluru Design District : దుబాయ్ తరహాలో బెంగళూరులో 3D ‘డిజైన్ డిస్ట్రిక్’

బెంగళూరులో దుబాయ్ (D3) తరహాలో కొత్త జిల్లా డిజైన్ రాబోతోంది. అవాంట్-గార్డ్ 'డిజైన్ డిస్ట్రిక్ట్' అతి త్వరలో నగరానికి రానుంది.

Bengaluru to get Dubai-like Design District : బెంగళూరులో దుబాయ్ (D3) తరహాలో కొత్త జిల్లా డిజైన్ రాబోతోంది. అవాంట్-గార్డ్ ‘డిజైన్ డిస్ట్రిక్ట్’ అతి త్వరలో నగరానికి రానుంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే కర్ణాటక ప్రభుత్వం ‘బెంగళూరు డిజైన్ డిస్ట్రిక్ట్’ నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఐటిశాఖ మంత్రి సిఎన్ అశ్వత్ నారాయణ్ చెప్పారు. బెంగళూరు డిజైన్ జిల్లా రూ .1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినట్టు ఆయన చెప్పారు. 4 రోజుల పాటు ఆయన దుబాయ్ ఎక్స్‌పోలో పర్యటించారు. అనంతరం ఆయన తిరిగి వచ్చిన తర్వాత విలేకరులతో మాట్లాడారు.

కర్నాటక పెట్టుబడులకు అనువైన గమ్యస్థానమని, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) నుంచి భారీ పెట్టుబడిదారులు అంగీకరిస్తున్నారని చెప్పారు. ఫలితంగా, బెంగళూరు త్వరలో ప్రపంచ స్థాయి డిజైన్ జిల్లాను పొందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జిల్లా డిజైన్ నాణ్యత విషయంలో దుబాయ్‌లో ఉన్నదానికంటే చాలా ముందుందని నారాయణ్ అన్నారు. బెంగళూరు డిజైన్ జిల్లా 100-150 ఎకరాలలో విస్తరించి ఉంటుందన్నారు.
Goa Congress : గోవాలో కాంగ్రెస్ కి మరో బిగ్ షాక్..ఆప్ లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం

ప్రపంచ స్థాయిలో వ్యాపారాలకు అవసరమైనది ఇక్కడే అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. డిజైన్, ఆర్ట్ ఫ్యాషన్ కలగలిసిన ప్రదేశంగా ఉంటుందని ఆయన చెప్పారు. బెంగళూరు డిజైన్ ఫెస్టివల్ కూడా ఇక్కడ నిర్వహించే అవకాశం ఉందని నారాయణ్ చెప్పారు. దుబాయ్ డిజైన్ డిస్ట్రిక్ట్ (d3) ఆర్ట్, డిజైన్, ఫ్యాషన్ పరిశ్రమలలో అతిపెద్ద గ్లోబల్, ప్రాంతీయ, స్థానిక బ్రాండ్‌లకు నిలయంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో వాటర్ థీమ్ పార్క్ ఏర్పాటుపై పెట్టుబడిదారులతో పాటు డెక్కర్ & హలాబీతో చర్చలు జరిగాయని చెప్పారు.

పెట్టుబడి ఒప్పందాలపై సంతకం చేసేందుకు GCC ప్రతినిధి బృందం నవంబర్‌లో కర్నాకటలో పర్యటించనున్నట్టు నారాయణ్ అన్నారు. ఎవోల్వెన్స్ గ్రూప్, క్రెసెంట్ గ్రూప్, డెక్కర్ & హలాబి, ఆస్టర్ డిఎమ్ హెల్త్‌కేర్, మైత్ర హాస్పిటల్, ముబదల ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఇతరులు కర్ణాటకలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపారు. లాజిస్టిక్స్, ఆరోగ్యం, విద్య, పోర్టులు, వెల్నెస్, ఇతర రంగాలలో ఉద్యోగాల కల్పనకు సాయపడుతుందని నారాయణ్ పేర్కొన్నారు. గల్ఫ్ ఇస్లామిక్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ మాత్రమే 3 ఏళ్ల కాలంలో ఇండియాలో రూ. 3,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ గ్రూప్ బెంగళూరులో ఆఫీసును కూడా ఓపెన్ చేయనుంది. ఇదివరకే దుబాయ్‌లో వారితో ఒప్పందం కుదుర్చుకుందని నారాయణ్ చెప్పారు.
CM KCR : గంజాయి సాగు చేస్తే రైతు బంధు, రైతు బీమా రద్దు

ట్రెండింగ్ వార్తలు