భర్త స్నానం చేయడం లేదని పోలీస్ కంప్లైంట్..

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మహిళ వింత ఫిర్యాదుతో బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. లాక్‌డౌన్ విధించిన మార్చి 24 నుంచి తన భర్త స్నానం చేయడం మానేశాడని అంతేకాకుండా సెక్స్ చేయాలని ఫోర్స్ చేస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. పోలీస్ హెల్ప్ లైన్ వచ్చి గృహ హింస కేసుల్లో ఒదకొటి. కుటుంబంతో ఎక్కువ కాలం గడిపితే చిన్న చిన్న మనస్ఫర్ధలు రావడం సహజం.

ఫలితంగా శారీరకంగా హింసించడం, మహిళను మానసికంగా వేధించడం వంటివి జరుగుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఆస్ట్రేలియా, బ్రిటన్, యూఎస్ లలోనూ ఇదే తరహాలో కేసులు నమోదవుతున్నాయి. ఫిర్యాదుపై పోలీసులు ఇలా స్పందించారు.  జయానగర్ లోని పరిహార్ నుంచి ఫోన్ వచ్చింది. 

31ఏళ్ల మహిళ తన భర్త కిరాణా షాపు నడుపుతుంటాడని.. కరోనా లాక్ డన్ లో షాపు ఓపెన్ చేయమన్నా తెరవడం లేదు. అప్పటి నుంచి స్నానం చేయడం కూడా మానేశాడు. స్నానం చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి పదే పదే చెప్పినా వినిపించుకోవడం లేదు. అలా ఉన్నా కూడా తనతో సెక్స్ చేయాలని.. నిరాకరించినందుకు కొట్టాడని తెలిపింది. 

అతనిని చూసి 9ఏళ్ల కూతురు కూడా స్నానం చేయడం మానేసింది. స్నానాలు చేయడం మానేయొద్దని ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. మరో కేసులో భార్య చికెన్ బిర్యానీ చేయలేదని ఇంట్లో నుంచి గెంటేశాడు. అందరూ ఇంట్లో ఉన్న కారణంగా పని ఒత్తిడి పెరిగిందని అందుకే మామూలు భోజనం తయారుచేస్తానని చెప్పిందట. దానికి ససేమిరా అని బిర్యానీ వండలేదని ఇంట్లోనుంచి వెళ్లగొట్టాడు. పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడం వారే వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్లారు. 

Also Read | కరోనా నయం చేస్తానంటున్న టీచర్