Customer Care Number : కాల్ నెంబర్‌‌కు ఫోన్ చేస్తున్నారా..SBI హెచ్చరికలు

మోసపూరిత కస్టమర్ కేర్ సెంటర్ల వలలో పడి...ఖాతాకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను షేర్ చేస్తే...అకౌంట్లలో ఉన్న డబ్బు మాయం అయ్యే అవకాశం ఉందని వెల్లడిస్తోంది.

Sbi

Customer Care Number SBI : ఏదైనా సమాచారం కావాలంటే అత్యధికమంది గూగుల్ ను ఆశ్రయిస్తుంటారు. వెంటనే గూగుల్ ఆ సమాచారాన్ని డిస్ ప్లే చేస్తుంది. ఫోన్ నెంబర్లు, కాల్ సెంటర్ నంబర్లు..ఇతరత్రా విషయాలను కూడా అందులో వెతుకుతుంటారు. బ్యాంకుల కస్టమర్ నెంబర్ల కోసం గూగుల్ లోనే కొంతమంది సెర్చ్ చేస్తుంటారు. అయితే..బ్యాకింగ్ విషయంలో అలా చేయకూడవద్దని చెబుతోంది SBI. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే సంగతి తెలిసిందే. తప్పుడు కస్టమర్ల నంబర్ల మోసాల బారిన పడే ప్రమాదం ఉందని కస్టమర్లకు హెచ్చరిస్తోంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేసింది.

Read More : Closing Bell : బ్లాక్ మండే..నష్టాల్లో స్టాక్ మార్కెట్..కారణాలివే

మోసపూరిత కస్టమర్ కేర్ సెంటర్ల వలలో పడి…ఖాతాకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను షేర్ చేస్తే…అకౌంట్లలో ఉన్న డబ్బు మాయం అయ్యే అవకాశం ఉందని వెల్లడిస్తోంది. దీనిపై ప్రజల్లో అవగాహన రావాలని..ఓ వీడియో కూడా పోస్టు చేసింది. మోసపూరిత కస్టమర్ కేర్ నెంబర్లతో జాగ్రత్తగా ఉండాలని..      సరైన కస్టమర్ నెంబర్ కోసం అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే సంప్రదించాలని ప్రజలకు తెలిపింది. అకౌంట్లకు సంబంధించిన వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని..అలాంటివి చేస్తే….నష్టపోయే అవకాశం ఉందని మరోసారి హెచ్చరించింది.

Read More : Anand Mahindra : వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా.. ఆనంద్ మహీంద్రా వార్నింగ్

ఓ వ్యక్తి కస్టమర్ కాల్ సెంటర్ నెంబర్ కావాలని సెర్చ్ చేస్తాడు. నెంబర్ డిస్ ప్లే..కాగానే..ఆ నంబర్ కు ఫోన్ చేయడం వీడియోలో కనిపిస్తుంది. కార్ లోన్ ఇంట్రెస్ట్ ఎంతుందో చెప్పాలని కోరుతాడు. దీనికి వెరిఫికేషన్ కోసం అకౌంట్ నెంబర్ పంపించాలని చెప్పడంతో..అలాగే చేస్తాడు. అకౌంట్ లో ప్రాబ్లమ్ ఉంది. డెబిట్ కార్డు బ్లాక్ అయ్యిందని..దీనిని పునరుద్ధరించడానికి కార్డు నెంబర్, CVV నెంబర్ పంపించాలని చెబుతుంది. ఏదో మోసం ఉందని గ్రహించి..ఎస్ బీఐ వెబ్ సెట్ కు వెళుతాడు.