Bharat Bandh : కొనసాగుతున్న భారత్ బంద్.. బ్యాంకు, ఏటీఎంలపై ఎఫెక్ట్!

ప్రైవేటీకరణ, ఇంధన ధరల పెంపు, ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గించడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు 48 గంటల బంద్‌ నిర్వహిస్తున్నాయి. కేంద్ర నిర్ణయాలతో సామాన్య ప్రజలు...

Bharat Bandh 48 Hrs : కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు చేపడుతున్న దేశవ్యాప్త సమ్మె కొనసాగుతోంది. రవాణా, విద్యుత్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సహా పలు రంగాలకు చెందిన కార్మికులు సమ్మెలో భాగమయ్యారు. ఇటీవల కేంద్ర కార్మిక సంఘాల వేదిక ఉమ్మడి నిర్వహించిన సమావేశంలో.. కార్మిక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలకు రెండు రోజుల పాటు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Read More : Bharat Bandh: రెండ్రోజుల పాటు భారత్ బంద్‍‌కు పిలుపు, బ్యాంకులకు తిప్పలు

ప్రైవేటీకరణ, ఇంధన ధరల పెంపు, ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గించడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు 48 గంటల బంద్‌ నిర్వహిస్తున్నాయి. కేంద్ర నిర్ణయాలతో సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయా సంఘాలు మండిపడుతున్నాయి. దేశవ్యాప్త సమ్మెలో బ్యాంకింగ్ రంగం పాల్గొంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ యోచనతో పాటు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి నిరసనగా బ్యాంకు యూనియన్లు సమ్మెలో పాల్గొననున్నాయి.

Read More : Bharat Bandh: నేడు భారత్ బంద్.. సాయంత్రం 4 వరకు ఎక్కడివక్కడే

బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ పాల్గొననున్నాయి. మరోవైపు.. ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ కూడా బంద్ కు మద్దతు ప్రకటించడంతో రెండు రోజుల పాటు బ్యాంకుల సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. సోమ, మంగళవారాల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడవచ్చని ఎస్బీఐతో సహా అనేక బ్యాంకులకు కస్టమర్లకు ముందే తెలియచేశాయి. దీంతో బ్యాంకులకు తాళాలు పడడడంతో ప్రజలు నగదు సమస్యను ఎదుర్కొన్నారు. ఏటీఎం సెంటర్లకు పరుగులు తీసినా ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో ఇతర ఏటీఎంల వైపు వెళుతున్నారు. మంగళవారం కూడా ఇదే పరిస్థితి ఏర్పడనుందని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు