Bharat Bandh LIVE Updates: భారత్ బంద్ విజయవంతం…

చర్చలకు రండి.. రైతులకు అమిత్ షా పిలుపు

[svt-event title=”చర్చలకు రండి.. రైతులకు అమిత్ షా పిలుపు ” date=”08/12/2020,15:46PM” class=”svt-cd-green” ]కేంద్ర హోం మంత్రి అమిత్ షా రైతులను చర్చలకు ఆహ్వానించారు. ఈరోజు (మంగళవారం)రాత్రి 7 గంటలకు రైతు సంఘాలతో అమిత్ షా చర్చలు జరపనున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం జరగాల్సిన చర్చలను మంగళవారమే నిర్వహించనున్నారు. [/svt-event]

[svt-event title=”భారత్ బంద్ విజయవంతం…” date=”08/12/2020,15:20PM” class=”svt-cd-green” ] వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్‌ బంద్‌‌ విజయవంతంగా ముగిసింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు బంద్ నిర్వహించారు. [/svt-event]

[svt-event title=”రైతుల కోసం రోడ్డెక్కిన మంత్రి కేటీఆర్” date=”08/12/2020,12:46PM” class=”svt-cd-green” ] వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్‌ బంద్‌‌కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా.. నిరసనల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. షాద్‌నగర్‌ బూర్గుల గేట్‌ వద్ద TRS శ్రేణులతో కలిసి కేటీఆర్‌ ఆందోళన చేపట్టారు. గత కొన్నిరోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు భారీ నష్టం చేకూరుతుందని ఈ సంధర్భంగా కేటీఆర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుమేరకు సాగు చట్టాలను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని అన్నారు.

[svt-event title=”మహారాష్ట్రలో..” date=”08/12/2020,12:35PM” class=”svt-cd-green” ] మహారాష్ట్రలో మాత్రం బంద్ పాక్షికంగా సాగుతుంది. అధికార శివసేన పార్టీ మద్దతు ప్రకటించినా.. శాంతియుతంగా బంద్ సాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో షాపులు తెరుచుకుని కనిపిస్తున్నాయి. ముంబైలోని మతుంగా ఏరియాలో షాపుల్లో ప్రజలు మాములుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు.

[svt-event title=”గృహ నిర్బంధంలో కేజ్రీవాల్‌” date=”08/12/2020,12:25PM” class=”svt-cd-green” ] రైతులు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ వెల్లడించింది. కేజ్రీవాల్ నివాసంలోకి ఎవరినీ అనుమతించట్లేదని, కేజ్రీవాల్‌ను బయటకు రానివ్వట్లేదని ఆప్ ఆరోపించింది.

[svt-event title=”తెరుచుకోని దుకాణాలు” date=”08/12/2020,10:18AM” class=”svt-cd-green” ] భారత్ బంద్ కు మద్దతుగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. దుకాణాలు స్వచ్ఛందంగా చాలావరకు మూసివేయబడ్డాయి.. అయితే అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉన్నాయని, రైతులకు స్వచ్ఛందంగా సంఘీభావం ప్రకటిస్తూ చాలామంది దుకాణాలు తెరవలేదని అన్నారు. మరోవైపు, రైతు నిరసనకారులు సింగు సరిహద్దులో చిక్కుకున్నారు. రైతుల నిరసనల దృష్ట్యా సింగూ సరిహద్దులో భద్రతా దళాలను మోహరించారు. [/svt-event]

[svt-event title=”ఆగిన రైళ్లు” date=”08/12/2020,10:15AM” class=”svt-cd-green” ] బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం బంద్‌ ప్రభావం స్వల్పంగా కనిపిస్తోండగా.. మహారాష్ట్రలోని బుల్ధన జిల్లాలో ఒక రైతు సంస్థ సభ్యులు రైలును ఆపారు. బుల్ధన జిల్లాలోని మల్కాపూర్ స్టేషన్‌లో చెన్నై-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపడం ద్వారా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ‘స్వాభిమాని శెట్‌కారి సంగథన్’ సభ్యులు నిరసన తెలిపారు. రైల్వే ట్రాక్‌ల నుండి నిరసనకారులను తొలగించిన తరువాత, పోలీసులు సంస్థ నాయకుడు రవికాంత్ తుపాకర్ మరియు అతని మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. [/svt-event]

[svt-event title=”రోడ్డక్కిన రైతులు.. సాగుతున్న బంద్!” date=”08/12/2020,10:12AM” class=”svt-cd-green” ] వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు భారత్ బంద్ నిర్వహిస్తుండగా.. ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని సింఘు, ట్రికీ రహదారుల్లో వేలాది మంది బైఠాయించి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. చట్టాలపై ప్రభుత్వం దిగిరాకపోవడంతో భారత్‌ బంద్‌కు రైతులు పిలుపునివ్వగా.. అన్నదాతల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారత్‌ బంద్‌ కొనసాగుతోంది.

[/svt-event]