Bharat Biotech Deal : 14 రాష్ట్రాలకు నేరుగా కోవాగ్జిన్ డోసులు.. భారత్‌ బయోటెక్‌ డీల్

కొవాగ్జిన్‌ టీకాను కొనుగోలు చేసేందుకు 14 రాష్ర్టాలు తమను సంప్రదించినట్లుగా భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. టీకా కంపెనీల నుంచి కావాల్సినన్ని డోసుల కొనుగోలుకు ఇటీవల రాష్ర్టాలకు కేంద్రం అనుమతించింది.

Bharat Biotech direct supply COVAXIN doses to 14 states : కొవాగ్జిన్‌ టీకాను కొనుగోలు చేసేందుకు 14 రాష్ర్టాలు తమను సంప్రదించినట్లుగా భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. టీకా కంపెనీల నుంచి కావాల్సినన్ని డోసుల కొనుగోలుకు ఇటీవల రాష్ర్టాలకు కేంద్రం అనుమతించింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌తో సంప్రదింపులు జరుపుతున్నాయి.

భారత్‌ బయోటెక్‌తో ఒప్పందం చేసుకున్న 14 రాష్ర్టాలలో ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలున్నాయి. ఈ 14 రాష్ర్టాలు కూడా కొవాగ్జిన్‌ను వీలైనంత త్వరగా సరఫరా చేయాలని కోరాయని భారత్‌ బయోటెక్‌ వర్గాలు తెలిపాయి.

దేశంలో ఉన్న 130 కోట్ల మంది జనాభాకు సకాలంలో వ్యాక్సిన్లు అందాలంటే టీకాల ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్లా. యూరోపియన్‌ యూనియన్‌-ఇండియా రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమె మాట్లాడారు.

కంపెనీల మధ్య ఒప్పందాలు, సాంకేతికత బదలాయింపు, కీలక యంత్రాల సరఫరా జరిగినప్పుడే టీకాల ఉత్పత్తి పెరుగుతుందని చెప్పారు. అదే సమయంలో దేశంలోని టీకా ఉత్పత్తి కంపెనీలకు భారీస్థాయిలో ముడిసరుకును అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.

ట్రెండింగ్ వార్తలు