Covaxin Vaccine
Bharat Biotech Covaxin phase-4 trials: కొవాగ్జిన్ నాలుగో దశ ట్రయల్స్‌కు భారత్ బయోటెక్ సిద్ధమవుతోంది. కొవాగ్జిన్ సామర్థ్యంపై విమర్శలు వస్తుండడంతో మరో దశ ట్రయల్స్ చేయాలని నిర్ణయం తీసుకుంది సదరు సంస్థ. కొవాగ్జిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను జులైలో బహిరంగ పరుస్తామని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు ఈ డేటాను మొదట సమర్పిస్తామని, ఆ తర్వాత వాటిని రివ్యూ జర్నల్స్‌కు అందిస్తామని వెల్లడించింది.
మూడో దశ అధ్యయన తుది విశ్లేషణ డేటా అందుబాటులోకి వచ్చాక కొవాగ్జిన్ పూర్తి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటామని భారత్ బయోటెక్ ప్రకటించింది. కొవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ అధికంగా యాంటీబాడీలు ఉత్పత్తి చేస్తోందని ఓ జర్నల్‌లో ప్రచురితమైన నివేదికలో అనేక లోపాలున్నాయని భారత్ బయోటెక్ కౌంటర్ ఇచ్చింది. కొవాగ్జిన్ టీకాను కోవిషీల్డ్‌తో పోలిస్తే యాంటీబాడీస్ కోవిషీల్డ్ వేసుకున్నవారిలో ఎక్కువగా ఉన్నాయంటూ.. ప్రచురించిన ఈ కథనాన్ని కొట్టిపారేసింది భారత్ బయోటెక్.
మరోవైపు భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ తీవ్రతకు కారణంగా భావిస్తోన్న డెల్టా వేరియంట్ నుంచి కొవాగ్జిన్ టీకా మెరుగైన రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనంలో వెల్లడించింది. పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ICMR సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది.