BJD MLA అభ్యర్థిపై బాంబు దాడి..

  • Publish Date - April 22, 2019 / 11:33 AM IST

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో మాజీ మేయర్, భువనేశ్వర్ సెంట్రల్ బీజూ జనతాదళ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత్ నారాయణ్ జెనాపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని  క్యాపిటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  బీజేడీ తరపున భువనేశ్వర్ సెంట్రల్ నుంచి బరిలోకి దిగిన జెనా… లక్ష్మీ సాగర్ ఝార్పాడా కెనాల్ రోడ్డు వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ  యువకుడు హఠాత్తుగా వచ్చి జెనా కారుపై వరుసగా మూడు బాంబులు విసిరేసి పరారయ్యాడు. 
Also Read : చిరంజీవి ‘పవన్ శంకర్’ : అభిమాని కొడుకుకి పేరు పెట్టిన చిరు

ఈ ఘటనలో అనంత నారాయణ్ జెనా తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో భువనేశ్వర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నారాయణ్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయన త్వరగా కోరుకోవాలని ప్రార్థిస్థున్నారు. 

కాగా ఒడిశాలో 21 లోక్ సభ,147 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగు దశలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో భాగంగా..మొదటి రెండు దశలు ఏప్రిల్ 11 మరియు ఏప్రిల్ 18 న జరిగాయి. మిగిలిన రెండు దశలు ఏప్రిల్ 23 మరియు 29 తేదీలలో జరుగుతాయి. ఫలితాలు మే 23 న ప్రకటించబడాయనే. 
Also Read : రెండో రోజు : శ్రీలంకలో మరో పేలుడు