Bhupesh Baghel satires on bjp over nadda chattigarh visit
Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్‌లో భారతీయ జనతా పార్టీ అధినేత జేపీ నడ్డా పర్యటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేట్ ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి నమూనాను అధ్యయనం చేయడం కోసమే నడ్డా రాష్ట్రానికి వస్తున్నారని ఆయన అన్నారు. తన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చూసి, కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి పథకాలను చేపడుతోందన్నారు.
భూపేష్ బాఘేల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఛత్తీస్‌గఢ్ అమలు చేస్తున్న అభివృద్ధి నమూనాను చూసి, అధ్యయనం చేయడం కోసమే బీజేపీ తరుచూ వస్తోంది. బీజేపీ ఒంటరిగా పోరాడదు. ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటుంది. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి న్యూఢిల్లీలో అగ్గిపెట్టె వంటి సచివాలయాన్ని నిర్మించారు. గాలి వీచిన ప్రతిసారీ దాని కిటికీలు పెద్ద చప్పుడు చేస్తాయి’’ అని విమర్శించారు.
వచ్చే ఏడది ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంపై బీజేపీ ఫోకస్ చేసింది. సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి.. గత ఎన్నికల్లో బాఘేల్ రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలి ఓటమి పాలైంది. తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది.