Asaduddin Owaisi: బలహీన ప్రధానితో కిచిడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం బెటర్.. మోదీ ఫిర్యాదులపై ఎద్దేవా చేసిన ఓవైసీ
‘‘ఎవరు సెక్యూలరో, ఎవరు సెక్యూలర్ కాదో సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. తాము సెక్యూలర్లం అని తరుచూ చెప్పుకునే వారు ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారు. ఒకవేళ మేము మైనారిటీల అభివృద్ధి గురించి మాట్లాడితే మాపై అర్థంలేని మాటలతో దాడి చేస్తారు. సెక్యూలర్ ఎక్స్పర్ట్ అని చెప్పుకునే వారి కపటత్వం ఇది. బయటికి చెప్పేది ఒకటి, అంతర్గతంగా మరొకటి’’ అని కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా ఓవైసీ విరుచుకుపడ్డారు.

Forming khichdi govt with weaker PM better than two time PM says Owaisi
Asaduddin Owaisi: లోక్సభలో మెజారిటీకి మించిన స్థానాలు ఉన్నప్పటికీ.. సిస్టం సరిగా లేదంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. మోదీని భారీ మెజారిటీతో రెండుసార్లు ఎన్నుకోవడం కంటే బలహీనమైన ప్రధానితో కిచిడీ ప్రభుత్వాన్ని (ఎక్కువ పార్టీల కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం) ఏర్పాటు చేయడం మంచిదని ఆయన ఎద్దేవా చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మాదాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓవైసీ పాల్గొని ప్రసంగించారు.
‘‘వ్యవస్థ మీద ఫిర్యాదు చేసే ప్రధానిని ఎన్నుకోవడం కంటే కిచిడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మంచిది. మోదీ మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. లోక్సభలో 306 మంది ఎంపీలను పెట్టుకుని వ్యవస్థ మీద ప్రధాని ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి ప్రధానిని రెండుసార్లు ఎన్నుకోవడం కంటే బలహీనమైన ప్రధానితో కిచిడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఉత్తమం’’ అని ఓవైసీ అన్నారు. ఇక సెక్యూలర్ అంశంపై సైతం ఓవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా విపక్షాల్ని లక్ష్యంగా చేసుకుని ఓవైసీ విమర్శలు చేశారు.
‘‘ఎవరు సెక్యూలరో, ఎవరు సెక్యూలర్ కాదో సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. తాము సెక్యూలర్లం అని తరుచూ చెప్పుకునే వారు ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారు. ఒకవేళ మేము మైనారిటీల అభివృద్ధి గురించి మాట్లాడితే మాపై అర్థంలేని మాటలతో దాడి చేస్తారు. సెక్యూలర్ ఎక్స్పర్ట్ అని చెప్పుకునే వారి కపటత్వం ఇది. బయటికి చెప్పేది ఒకటి, అంతర్గతంగా మరొకటి’’ అని కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా ఓవైసీ విరుచుకుపడ్డారు.
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ పాదయాత్రపై ప్రశాంత్ కిశోర్ సెటైర్లు