Delhi airport: విమానాశ్రయంలో ఎన్నడూ లేనంత భారీగా పట్టుబడ్డ విదేశీ కరెన్సీ.. ఈ ముగ్గురు కలిసి..

ఇస్తాంబుల్ (Istanbul)కు వెళ్లే TK 0717 నంబరు విమానం ఎక్కాలనుకున్న వారిని అధికారులు తనిఖీ చేశారు.

Delhi airport

Delhi airport – Foreign currency: విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికులు కలిసి భారీగా విదేశీ కరెన్సీతో పట్టుబడ్డారు. ఇంత విదేశీ కరెన్సీని తాము ఎన్నడూ స్వాధీనం చేసుకోలేదని అధికారులు చెప్పారు.

తజికిస్థాన్‌ (Tajikistan) జాతీయులైన ముగ్గురు వ్యక్తులు రూ.10 కోట్ల విలువచేసే కరెన్సీతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (IGI) వచ్చారు. ఇస్తాంబుల్ (Istanbul)కు వెళ్లే TK 0717 నంబరు విమానం ఎక్కాలనుకున్న వారిని అధికారులు తనిఖీ చేశారు. దీంతో విదేశీ కరెన్సీ పెద్ద మొత్తంలో పట్టుబడిందని అధికారులు చెప్పారు.

వాటిలో అమెరికా డాలర్లు 7,20,000, యూరోలు 4,66,200 ఉన్నాయని చెప్పారు. భారతీయ కరెన్సీలో ఆ మొత్తం దాదాపు రూ.10,06,78,410గా తేలిందని వివరించారు. కస్టమ్స్ చట్టం 1962 సెక్షన్ 110 కింద ఆ విదేశీ కరెన్సీని సీజ్ చేశామని చెప్పారు. దీనిపై తదుపరి విచారణ జరుపుతున్నామని అన్నారు.

Dream Controlling Chip : కలల్ని కంట్రోల్ చేయటానికి డ్రిల్లింగ్ మిషన్‌తో తలకు రంధ్రం చేసి చిప్ పెట్టుకున్న వ్యక్తి .. ఆ తరువాత ఏమైందంటే

ట్రెండింగ్ వార్తలు