ఏవైందో తెలీదుకానీ బీహార్ లోని భాగల్ పూర్‌లో ఓ గుర్రం ఉన్నట్లుండి..పరుగందుకుంది. రోడ్డుపై తన హార్స్ పవర్ ఏంటో చూపించింది. రోడ్డుపై పరుగందుకున్న ఈ గుర్రం..స్పీడ్ గా దూసుకుపోతున్న కార్లు..బైకుల్ని క్షణాల్లో దాటుకుంటూ తనదైన శైలిలో పరుగందుకుంది. ఆదాని స్పీడ్ ను కంట్రోల్ చేయటం ఎవ్వరి వల్లా కాలేదు.
దాని స్పీడ్ అడ్డుకోవటం అంటే మాటలు కాదు. అలా పరుగెడుతున్న ఆ హార్స్ ఓ బైకర్ ను ఢీకొని పక్కకు పడిపోయింది. అలా అది రోడ్డు పక్కన పడిపోయింది. అలా రెండు మూడు బైక్ లు దాని పడిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కానీ..ఆ గుర్రం పరుగును చూడాల్సిందే. అది రోడ్డుపై పరుగెడుతుంటే చూసినవాళ్లంతా కేకలు వేశారు. మీరు కూడా ఈ హార్స్ రన్నింగ్ ను చూడండీ..తప్పకుండా దటీజ్ హార్స్ పవర్ అని అనుకోకుండా ఉండరు. రోడ్డుపై గుర్రం డెక్కల చప్పుడు వింటే వారెవ్వా ఏమీ ఈ హార్స్ రాజసం..అనుకోవాల్సిందే.