Sir..ఫెయిల్ అయితే పెళ్లి అవ్వదు..పాస్ చేసి పుణ్యం కట్టుకోండీ : విద్యార్ధుల వినతులు

  • Published On : March 22, 2021 / 01:10 PM IST

Bihar Board Class 12th Answer Key 2020 Released 

bihar board class 12th answer key 2020 released  : విద్యార్ధులు పరీక్షల్లో ఏం రాస్తారు? అదేం పిచ్చి ప్రశ్న? పరీక్షల పేపర్లో వచ్చి క్వశ్చన్లకు ఆన్సర్లు రాస్తారు అని ఎవరైనా సరే ఠక్కుమని చెబుతారు. కానీ బీహార్ లో మాత్రం బోర్డ్ ఎగ్జామ్ రాసిని విద్యార్ధులు పరీక్షల్లో కొన్ని ఆన్సర్లతో పాటు ‘‘Sir..ఫెయిల్ అయితే పెళ్లి అవ్వదు..పాస్ చేసి పుణ్యం కట్టుకోండీ’ అంటూ విద్యార్ధుల వింత వినతులు చేసుకున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బీహార్‌లో 12th class బోర్డ్ ఎగ్జామ్స్ ఆన్సర్ పేపర్లపై విద్యార్ధులు ఇలా రాసుకొచ్చారు. ఎగ్జామ్స్ రాసిన విద్యార్ధులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. పేపర్ కరక్షన్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. ఫలితాల కోసం విద్యార్ధులంతా ఎదురు చూస్తున్నారు. అయితే కొందరు విద్యార్థులు సమాధాన పత్రాలలో పలు విచిత్రమైన వినతులు చేసుకున్నారు. ‘‘కరోనా కారణంగా సరిగా చదువుకోలేక పోయామని..పాస్ అవుతామో లేదో అనే భయంగా ఉందనీ..దయచేసి, తమను పాస్ చేయాలని వేడుకున్నారు. కొంతమంది తాము హనుమంతుని భక్తులమని.. తమను పాస్ చేయాలని కోరారు. ఆన్సర్ షీట్లలో వినతులు రాసుకొచ్చారు.

ఓ విద్యార్థి అయితే ఏకంగా ‘‘మే 26న నా వివాహం జరగనుంది. ఒక వేళ ఫెయిల్ అయ్యానంటే ఏమవుతుందో తెలియడం లేదు. అందుకే సార్… నన్ను ఫస్ట్ డివిజన్‌లో పాస్ చేయండి‘ అని వేడుకుంటే..మరో విద్యార్థిని ‘సార్… నాదొక అభ్యర్థన… నేను పరీక్ష బాగా రాయలేకపోయాను. ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఫీవర్ వచ్చింది. సార్ నన్ను మీ కుమార్తెగా భావించి, మంచి మార్కులు వేయండి. మాది చాల పేద కుటుంబం. నన్ను అర్థం చేసుకోండి’ అంటూ రాసినట్లుగా తెలుస్తోంది. మరో విద్యార్థి అయితే..‘‘సార్ నన్ను క్షమించండి. నేను చాలా పేదవాడిని. దయచేసి అర్థం చేసుకోండీ..కావాలంటే మీ కాళ్లపై వాలిపోతాను. దయచేసి మంచి మార్కులు వేయండి..అంటూ వేడుకున్నాడు.