జర్నలిస్టులకు సీఎం నితీశ్ కుమార్ బంపర్ ఆఫర్.. ప్రతీనెల రూ.15వేలు.. వితంతువులకు రూ.10వేలు

బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద జర్నలిస్టులకు ప్రతీనెల అక్కడి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. అర్హత కలిగిన జర్నలిస్టులకు నెలకు రూ.6వేలు ఇస్తుంది. ప్రస్తుతం ఆ పెన్షన్ ను ..

bihar cm nitish kumar

Bihar CM Nitish Kumar: బీహార్‌లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ప్రజలపై సీఎం నితీశ్ కుమార్ వరాల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా.. జర్నలిస్టులకు తీపికబురు చెప్పారు.

బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద జర్నలిస్టులకు ప్రతీనెల అక్కడి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. అర్హత కలిగిన జర్నలిస్టులకు నెలకు రూ.6వేలు ఇస్తుంది. ప్రస్తుతం ఆ పెన్షన్ ను రూ.15వేలకు పెంపు చేస్తానని సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. అంతేకాదు.. ఈ పథకం కింద పెన్షన్ పొందుతున్న జర్నలిస్ట్ మరణిస్తే.. మరణించిన వ్యక్తి భార్యకు ప్రస్తుతం ప్రతీ నెల రూ.3వేలు అందుతుంది. నితీశ్ నిర్ణయంతో ఇక నుంచి ప్రతీనెల రూ. 10వేలు జీవితకాల పెన్షన్ లభిస్తుంది. నితీశ్ కుమార్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.


అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, వితంతు మహిళలకు ప్రతినెల ఇచ్చే పెన్షన్‌ను పెంచుతున్నట్లు నితీశ్ కుమార్ ప్రకటించారు. గృహ వినియోగదారులకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తుంది. జులై బిల్లు నుంచే ఈ ప్రయోజనాలు అందుతాయని చెప్పారు. మరోవైపు.. రాబోయే ఐదేళ్లలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉపాధి అవకాశాలను కూడా ప్రకటించారు.