Bizarre Remarks by Nitish Kumar: మరీ ఇంత నీచమా? నిండు అసెంబ్లీలో సెక్స్‭పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం

వాస్తవానికి నితీశ్ వ్యవహార శైలి ఇలా ఉండదు. కానీ కొద్ది రోజులుగా ఆయన కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు. తరుచూ ఏదో వివాదంతో వార్తల్లో ఉంటున్నారు

Bizarre Remarks by Nitish Kumar: అసెంబ్లీల్లో చట్ట సభ్యులు పోర్న్ వీడియోస్ చూసినట్లు చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఇక బయట అయితే రాజకీయ నేతల నోటికి అదుపు తక్కువే ఉంటుంది. చాలా మంది చాలా సార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా, వీటన్నింటినీ మించిన ఘటన ఒకటి మంగళవారం బిహార్ అసెంబ్లీలో చోటు చేసుకుంది. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నితీశ్ కుమార్.. నిండు అసెంబ్లీలో సెక్స్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నెటిజెన్లు అయితే ఒక ముఖ్యమంత్రి అయి ఉండి, అసెంబ్లీ వేదికగా మరీ ఇంత నీచంగా వ్యాఖ్యానించాలా? అంటూ మండిపడుతున్నారు.

విషయంలోకి వెళితే.. రాష్ట్రంలో జనాభా పెరుగుదల కాస్త మందగించింది. అదే సమయంలో మహిళా అక్షరాస్యత పెరిగింది. అయితే మహిళా అక్షరాస్యత వల్లే జనాభా పెరుగుదల తగ్గిందని చెప్పబోయే క్రమంలోనే నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దాని కోసం ఆయన ఏకంగా బెడ్రూంలోకి దూరి మరీ చెప్పడం గమనార్హం. పునరుత్పత్తిని తగ్గించడం, నిరోధించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించే క్రమంలో అదుపు తప్పే మాట్లాడారు. నితీశ్ వ్యాఖ్యలపై విపక్ష పార్టీలైతే ఒంటి కాలిపై లేస్తున్నాయి.

వాస్తవానికి నితీశ్ వ్యవహార శైలి ఇలా ఉండదు. కానీ కొద్ది రోజులుగా ఆయన కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు. తరుచూ ఏదో వివాదంతో వార్తల్లో ఉంటున్నారు. సోమవారం తన మంత్రి డాక్టర్ అశోక్ చౌదరి నివాళులర్పించే సభలో ఆయన తలపై పూలమాల వేసి వార్తల్లో నిలిచారు. దీనికి ముందు ఒక జర్నలిస్టుతో మాట్లాడుతున్న క్రమంలో తన సహ మంత్రి డాక్టర్ చౌదరి తలపై కొట్టారు. అంతకు ముందు కూడా ఒకసారి భూమి విధ్వంసం గురించి మాట్లాడాడు. నిజానికి నితీశ్ వ్యవహార శైలిలో ఇలాంటి సాధారణం అవుతున్నాయి. అంతలోనే తాజా వ్యాఖ్యలతో పెద్ద దుమారానికే తెర లేపారు.