Bihar Education department bans jeans, t shirts
Bihar Education department : బీహార్ విద్యాశాఖ జీన్స్, టీషర్ట్ పై నిషేధాన్ని విధించింది. విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, ఇతర సిబ్బంది జీన్స్, టీషర్ట్ ధరించటంపై నిషేధించింది. దీనికి సంబంధించి విద్యాశాఖ డైరెక్టర్ బుధవారం (జూన్ 28,2023) ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖ కార్యాలయాల్లో పని చేసే వారు కేవలం ఫార్మట్ డ్రెస్ ధరించాలని..జీన్స్, టీషర్ట్ వంటి క్యాజుబల్స్ ధరించి రాకూడదని ఆదేశించారు.
ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లుగా దుస్తులు ధరించవద్దని సూచించింది.ఇటువంటి దుస్తులు ధరించి రావటంవల్ల కార్యాలయాల సంస్కృతి దెబ్బతింటోందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు.
కాగా ఇటువంటి ఆదేశాలు వెలువడటంపై బీహార్ విద్యాశాఖ మాత్రం రాష్ట్ర విద్యాశాఖా మంత్రి చంద్రశేఖర్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. 2019లోనే సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు జీన్స్ టీషర్ట్ వేసుకురావడంపై బీహార్ ప్రభుత్వం నిషేధం విధించింది. సింపుల్ గా..లైట్ కలర్ లో ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలని ఆదేశించింది.