Bihar elections 2020: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవటానికి అభ్యర్థులు గేదెలు ఎక్కి మరీ ప్రచారంచేస్తున్నారు. మేము రైతు బిడ్డలం అంటూ ఓట్లు అడుగుతున్నారు.తాజాగా గయా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ పార్టీ అభ్యర్థి మహ్మద్ పర్వేజ్ మన్సూరి గేదెపై ఊరేగుతూ ప్రచారం చేశారు.
https://10tv.in/cut-open-my-heart-you-will-find-modi-ji-chirag-paswan-as-bjp-hits-out/
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటం అవి పోలీసుల దృష్టికి వెళ్లటంతో ఎన్నికల ప్రచారానికి జంతువులను హింసించారనే నెపంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
అనంతరం అతనిపై జంతు సంరక్షణ చట్టంతో పాటు.. కరోనా వైరస్ నిబంధల్ని ఉల్లంఘించారని కేసులు నమోదు చేశారు. తరువాత అతడు బెయిల్‌పై విడుదలై వచ్చి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.ఇలాంటి ఘటనే బహదరాపూర్ నియోజకవర్గంలో కూడా జరిగింది.
ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నాచారి మండల్ అనే రైతు నామినేషన్ వేసేందుకు గేదెపై ఊరేగుతూ వచ్చాడు. నేను రైతుబిడ్డను.తన వద్ద కూర్చోడానికి కుర్చీ కూడా లేదని..దయచేసిన నాకు ఓట్లు వేయండీ అంటూ ఓటర్లను కోరాడు.
రైతుకు గేదెలు, ఆవులు, ఎద్దులే ఆస్తులనీ ప్రచారంలో ఊదరగొట్టాడు. గేదెపై ఊరేగిన ఇతనిపై కూడా పోలీసులు జంతు సంరక్షణ చట్టంతో పాటు కరోనా వైరస్ నియమావళి ఉల్లంఘ కేసులు నమోదు చేశారు. కానీ మూగజీవాలను హింసిస్తున్నారంటూ జంతు ప్రేమికులు మండిపతున్నారు.రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం జంతువులను హింసిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.